భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని అనుభవించాలంటే మొదటి నుండి కష్టపడాలి. అంటే మీరు విద్యార్థి దశ నుండి మనసులో ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా మనము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మరువకుందా సాధన చేస్తూ ఉండాలి. అసలే నేడు ఈ ప్రపంచంలో ఉద్యోగం కోసం పోటీ మామూలుగా లేదు. కాబట్టి నీలో ఉన్న సత్తాను బయటపెడితే కానీ అనుకున్నది సాధించడం చాలా కష్టం. కొందరు విద్యార్ధి దశ నుండి కష్టపడుతూ ఉండవచ్చు. మరి కొందరు ఒక స్థాయి వరకు సాధారణంగా కష్టపడి ఏదైనా పోటీ పరీక్షల నుండి మాత్రమే బాగా కష్టపడడానికి ప్రణాళిక చేసుకోవచ్చు. కానీ మీ అంతిమ లక్ష్యం మాత్రం మీరు అనుకున్నది అయి ఉండాలి.

అయితే ఇలాంటి ఎందరో విద్యార్దులు, లేదా ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావొచ్చు, వారందరికీ తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసి రాష్ట్ర విద్యార్దులు మరియు భావితరం కోసం కష్టపడుతున్న ఎందరో అభ్యర్థుల కోసం తన ఆలోచనను బాధను ఈ సూచన రూపంలో తెలియచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఈ రోజుల్లో ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఈ విలువ తెలిసిన మంత్రి కేటీఆర్ అందరినీ ఉద్దేశించి కొన్ని కీలక సూచనలు చేశాడు. కేటీఆర్  మాట్లాడుతూ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా వారంతా కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.

మీ పరీక్షలకు సరిగ్గా ఒక 6 నెలల ముందు నుండి సినిమాలు చూడడం మానేయండి అన్నారు. అంతే కాకుండా మనిషికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏ సాధనాలను ఉపయోగించడం తగదు అని అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా క్రికెట్, వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ లాంటి వాటికి పూర్తిగా దూరం కావాలని కేటీఆర్ అభ్యర్థులకు సలహా ఇచ్చారు. పైన మనము తెలిపినవి అన్నీ కూడా వ్యక్తిగతంగా తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని సంతోష పెడతాయి. అంతే కానీ శాశ్వతంగా మీకు సంతోషం మరియు మీ తల్లితండ్రులకు సంతోషాన్ని కలిగించే మీ కెరీర్ పై దృష్టి పెట్టండి అంటూ కేటీఆర్ తన విలువైన సలహాను ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: