ప్రపంచ వ్యాప్తంగా తాజాగా ఎక్స్ ఈ ఒమిక్రాన్ కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది. ఎక్స్ ఈ కరోనా వేరియంట్ మొదటి సారిగా యూకేలో కనుగొన్నామనీ.. 600కంటే ఎక్కువ ఎక్స్ ఈ కేసులు నిర్దారణ అయ్యాయని తెలిపింది.

కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరంలోని దాదాపు 2.6కోట్ల మందిని.. యాంటీజెన్ కిట్లను వాడి స్వయంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. సోమవారం నగర వాసులంతా స్వయంగా కోవిడ్ పరీక్షలు చేసుకోనున్నారు. షాంఘై ప్రస్తుతం పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. ఈ రోజు 7వేల 788 కేసులు నమోదు కాగా.. శనివారం 6,501 కేసులు వెలుగుచూశాయి.

కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. కోవిడ్ ప్రస్తుతం బ్రిటన్ ను వణికిస్తోంది. గడిచిన వారం రోజుల్లో బ్రిటన్ లో ప్రతి 13మందిలో ఒకరు కోవిడ్ బారిన పడినట్టు తేలింది. గత వారంలో ఏకంగా 49లక్షల మందికి  వైరస్ సోకగా.. అంతకు ముందువారం 43లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఒమిక్రాన్ ఉపవేరియంట్ అయిన బీఏ.2ప్రస్తుతం బ్రిటన్ లో తీవ్రంగా వ్యాపిస్తోంది.

ఇక ప్రపంచ దేశాలతోే పోలిస్తే భారత్ లోనే కరోనా మరణాలు తక్కువని కేంద్రం వెల్లడించింది. డబ్ల్యూహెచ్ ఓ ప్రకారం.. దేశంలో ప్రతి 10లక్షల జనాభాకు 374మది కోరనా బాధితులు చనిపోయారని పేర్కొంది. అమెరికాలో ప్రతి పదిలక్షల మందికి 2వేల 920మరణాలు చోటు చేసుకోగా.. బ్రెజిల్ లో 3వేల 92, రష్యాలో 2వేల 506, మెక్సికోలో 2వేల 498మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది. కోవిడ్ కేసులు, మరణాల పట్ల పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది.

మరోవైపు కరోనా కాలర్ ట్యూన్లకు ఇక ముగింపు పడనుంది. కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన కాలర్ ట్యూన్లను తీసేయాలని టెలికాం సంస్థలను కేంద్రం కోరింది. కాలర్ ట్యూన్ల వల్ల ప్రజల్లో అవసరమైన అవగాహన ఇప్పటికే వచ్చిందని పేర్కొంది. కరోనా కాలర్ ట్యూన్ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఆలస్య మవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించింది. తక్షణమే కాలర్ ట్యూన్ల తొలగించాలని చెప్పింది.










మరింత సమాచారం తెలుసుకోండి: