ఆ నగరంలో జంటలు దూరంగా వుండాలని, హగ్ లు, ముద్దులు కొద్ది రోజుల వరకు బంద్ చేయాలని కనీసం కలిసి పడుకోకూడదు అని విడివిడిగా నిద్రించాలి అని ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇంత వింత ఏమిటి ? అసలు ఏంటి ఈ విచిత్ర ఆంక్షలు ? ఎందుకోసం అన్న వివరాల్లోకి వెళితే...

చైనా దేశం లో కరోనా కేసులు మళ్ళీ భారీ స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ చైనా ఆర్ధిక నగరం షాంఘై లో వైరస్ కట్టలు తెంచుకుని వ్యాప్తి వేగాన్ని పెంచింది. దాంతో అక్కడ నిత్యం భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ను పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఎప్పుడూ జనాల సందడితో కిటకిట లాడుతుండే వీదుల్లో కేవలం అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు కాళ్ళ రోబోట్ లు మరియు ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే దర్శనమిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా సర్కారు మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రజలకు సూచించింది.


కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. కుటుంబ సభ్యులు కూడా దూర దూరంగా ఉండటమే మంచిదని తెలిపింది. అంతేకాదు జంటలు సైతం దూరంగా ఉండాలని వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని సూచించింది. అప్పటి వరకు జంటలు హగ్ లకు ముద్దులకు దూరంగా ఉండాలని, దూర దూరంగా నిద్రించాలి అని తెలిపింది. అక్కడ ప్రస్తుతం అధికారులు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరినీ బయటకు రాకుండా చూస్తూ వారికి కనీస అవసరాలకు మాత్రమే అదికూడా నియమిత సమయాల్లోనే బయటకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అదికూడా ఇంటి నుండి ఒక్కరూ మాత్రమే అని ఖచ్చితంగా చెబుతున్నారు. వీలయినంత త్వరలో కరోనాను కట్టడి చేస్తామని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: