దేశంలో నేటికీ కరోనా మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలను ఈ మహమ్మారి బలిగొంటూనే ఉంది. బ్రతుకు జీవుడా అంటూ నానా కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటే... ఈ మాత్రం సౌకర్యంగా జీవిస్తే చాలు అని జీవిస్తూ ఉంటే ఎక్కడి నుండో వచ్చిన ఈ మాయదారి వైరస్ పుటుక్కున ప్రాణాలు తీసేస్తుండటం అమానుషం. అయినా ఈ మహమ్మారి ఎప్పటికి ఈ ప్రపంచాన్ని వీడి వెళుతుంది అన్నది ఎవరు చెప్పలేకున్నారు. మరో వైపు మన దేశంలో శాంతించింది కరోనా అనుకుంటుంటే మళ్ళీ రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల సంఖ్య స్వల్పంగానే వున్నా మళ్ళీ ఎక్కడ విజృభిస్తుందా అని ఆందోళన వ్యక్తం అవుతోంది.

తాజాగా దేశంలో నమోదు అయిన కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి.  గడిచిన 24 గంటలలో మొత్తం దేశంలో 4,55,179 కరోనా టెస్ట్ లు చేయగా.. అందులో 2527 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. 33 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి అని శనివారం నేడు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసినటువంటి కరోనా బులిటెన్ లో వెల్లడి అయ్యింది. తాజాగా పెరిగిన కేసులతో కలపగా దేశంలో కోవిడ్  పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,54,952 కి చేరింది.  ఇక కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా మరణించిన కరోనా బాధితుల సంఖ్య 5,22,149 కు చేరింది. రికవరీ రేటు 98.75 అని అదే విధంగా పాజిటివిటీ రేటు 0.56గా ఉన్నట్లు వైద్య బృందం వెల్లడించింది.

కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది ఏమిటి అంటే ఇంకా కొంత కాలం కరోనా నింబందలను తప్పక పాటించాలి అని, కరోనా మళ్ళీ కొత్త రూపం దాల్చకుండా మనం జాగ్రత్త పడినట్లైతే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం మరియు ప్రజలు అయినా మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై చర్చ జరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: