వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం తమదే అని అంటు బీజేపీ నానా గోలచేస్తున్నది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితి చూస్తుంటే అందుకు ఏమాత్రం అవకాశం లేదని అనిపిస్తోంది. 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులే లేని పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటే ఎలా నమ్మటం. కానీ ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నపుడు నమ్మాల్సిందే. అయితే వాళ్ళ మాటలకు హేతువు ఏమిటి ?





హేతువు ఏమిటంటే కర్నాటక, రీసెంటుగా మహారాష్ట్ర ఫార్మూలాను అనుసరించాలన్న ఆలోచనే ఎక్కువగా ఉందట. సొంతంగా అత్యధిక ఎంఎల్ఏ స్ధానాల్లో గెలుచుకుని తెలంగాణాలో అధికారంలోకి రావటం వచ్చే ఎన్నికల్లో అయితే జరిగేపనికాదు. మరి అధికారంలోకి రావటం ఎలాగ ? ఎలాగంటే వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ రావాలని బీజేపీ నేతలు బలంగా కోరుకుంటున్నారట.





ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు సీట్లు షేర్ చేసుకోవాల్సి రావచ్చు. అంటే ఉన్న సీట్లనే మూడు ప్రధాన పార్టీలు తలాకొంత పంచుకోవటం అన్నమాట. అప్పుడు ఏ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం రాదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 60 సీట్ల మార్కు దాటాలి. ఏపార్టీకి 60 సీట్లు రానపుడు మామూలుగా అయితే ఏవో రెండుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయి.





కానీ తెలంగాణాలో అలా జరిగే అవకాశం లేదనే చెప్పాలి. అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టేస్తే ప్రభుత్వ పగ్గాలు ఆటోమేటిగ్గా బీజేపీ చేతిలోకి వెళిపోతాయి. తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఎంతమందిని వీలుంటే అంతమందిని లాగేసుకుంటే పనైపోతుంది. రాష్ట్రంలో ఎలాగూ టీఆర్ఎస్ అధికారంలో ఉండదుకాబట్టి గులాబీ పార్టీనేతలు ఎంతగోల చేసినా ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదంటే గవర్నర్ ఎలాగూ కేంద్రం చెప్పినట్లే వింటారు. సో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ నేతల ప్రకటనకు అర్ధమిదేలాగుంది. మొత్తానికి ప్రజామద్దతు లేకపోయినా సాంకేతికంగా కలసివస్తున్న అవకాశాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంపై పెత్తనం చేయటానికి రెడీ అయిపోతోందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: