నిలువెల్లా నరేంద్రమోడీని ఎదుర్కునేందుకు కేసీయార్ కు కొత్త మార్గం దొరికినట్లే ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడినపుడు కేసీయార్ వైఖరి చూసిన తర్వాత అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే సీబీఐ ఎంట్రీని నిషేధిస్తు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ మంచిపని చేశారని కితాబునిచ్చారు. చూస్తుంటే కేసీయార్ కూడా తొందరలోనే సీబీఐ ఎంట్రీని నిషేధించాలనే ఆలోచనలో ఉన్నట్లు అర్ధమవుతోంది.





శాంతి భద్రతలన్నవి రాష్ట్రాల పరిధిలోని అంశాలంటు కేసీయార్ పదే పదే చెప్పారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని కావని ఎవరు అనలేదు. కాకపోతే శాంతిభద్రతలను చూసేది లా అండ్ ఆర్డర్ పోలీసులే కానీ సీబీఐ కాదు. సీబీఐ అంటేనే రెగ్యులర్ పోలీసుల విచారణకు మించిన విచారణ అవసరమైనపుడు మాత్రమే సీబీఐ విచారణ కోరుతుంటారు. అలాంటి సీబీఐ విచారణ ఇపుడు రాజకీయంగా అనేక వివాదాస్పదమైపోతోంది. ఎలాగూ కేసీయార్ కు కూడా సీబీఐతో సమస్యలు తప్పేట్లులేదు.





ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కూతురు కవిత పేరు వినిపిస్తోంది. లిక్కర్ స్కాంను సీబీఐ దర్యాప్తుచేస్తోంది. అంటే ఏదోరోజు హఠాత్తుగా దర్యాప్తుపేరుతో కవిత దగగ్గరకు సీబీఐ వచ్చే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని కేసీయార్ గ్రహించినట్లే అనుమానంగా ఉంది. అందుకనే బీహార్లోకి సీబీఐ ఎంట్రిపై నిషేధాన్ని కేసీయార్ స్వాగతించారు. బహుశా హైదరాబాద్ కు తిరిగిరాగానే తెలంగాణాలోకి కూడా సీబీఐ ఎంట్రీని నిషేధించే ఆలోచనలో ఉన్నారేమో చూడాలి.





ఇపుడు కేసీయార్ విషయంలో ఏదైతే జరుగుతోందో 2019 ఎన్నికలకు ముందు ఏపీలో కూడా ఇలాగే జరిగింది. అప్పట్లో చంద్రబాబునాయుడు కూడా ఏపీలోకి సీబీఐ ఎంట్రీని నిషేధించారు. అయితే ఇక్కడ కేసీయార్ గమనించాల్సిందేమంటే హైకోర్టు గనుక ఆదేశిస్తే సీబీఐ నిరభ్యంతరంగా రాష్ట్రంలోకి  ఎంటరవ్వచ్చు. సీబీఐని మాత్రమే రాష్ట్రప్రభుత్వం నిషేధించగలదు. ఈడీ, ఐటి శాఖల దర్యాప్తును అడ్డుకునేంత సీన్ రాష్ట్రప్రభుత్వాలకు ఉండదు. కవితను సీబీఐ విచారించదలచుకుంటే ఏదోమార్గంలో హ్యపీగా ఎంటరైపోగలదు సీబీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: