
వీరిలో ఆర్కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనిత మరియు విడదల రజినీలు ఉన్నారు. అయితే వైసీపీ కమాండ్ నుండి మరియు కొన్ని సర్వే ల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నలుగురు మహిళా ఎమ్మెల్యే లలో ది బెస్ట్ ఎవరు అన్నదానికి మొదటి సారి మంత్రి వర్గంలోకి వచ్చిన విడదల రజిని పేరు వినిపిస్తోంది. అయితే మిగిలిన ముగ్గురు కూడా ఏదో ఒక నెగటివిటీ తో మైలేజ్ రావడం లేదు. అందులో రోజా ఎప్పటిలాగే నిత్యం మంత్రి ని అని మర్చిపోయి వాదనలకు దిగడం వలన విమర్శల పాలవుతోంది. ఇక ఉష శ్రీ చరణ్ అయితే ఎమ్మెల్యే గా చేసిన శ్రమ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అని అంటున్నారు. మంత్రిగా ప్రజలకు చాలా దూరంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తానేటి వనిత సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైలైట్ అవుతోంది.
కాగా వీరి ముగ్గురికన్నా కూడా ది బెస్ట్ గా తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేసుకుంటూ వెళుతోంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే గా గెలిచిన విడదల రజినీ మంత్రి కాక ముందు దూకుడుగా ఉన్నప్పటికీ.. మంత్రిగా అయ్యాక మాత్రం ఎంతో హుందాగా నడుచుకుంటూ... అటు పార్టీ కార్యక్రమాలను ఇటు వైద్య శాఖ మంత్రిగా అన్ని విషయాలలో చొరవ తీసుకుని ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. అందుకే సీఎం జగన్ దృష్టిలో కూడా మంచి మంత్రిగా పేరు తెచ్చుకుంది.