ద్విచక్ర వాహనాల రూల్స్ గురించి చాలా మందికి చాలా తెలియవు..తప్పనిసరిగా వాహనం నడిపేవారు అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించాలి.. తెలుసుకోవాలి.రెండు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొదట సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. రెండవది పోలీసులు మీకు చలాన్ చేయరు. లేకపోతే, ట్రాఫిక్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు.. మీకు చలాన్ పడే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు మాత్రమే జరిమానాతో సరిపెడుతారు.. అది కూడా దాటితే కోర్టు వరకు వెళ్తుంది. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి రావచ్చు.


ఇలాంటి పరిస్థితిలో మీ చలాన్ పడకూడదని మీరు కోరుకుంటే.. అప్పుడు ట్రాఫిక్ నియమాలను అనుసరించడం తప్పనిసరి.. అంతే కాదు కొంత వరకు ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా తెలుసుకోవాలి.. ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి మరింత కఠినతరం చేస్తోంది. అదే అమలు కోసం 1989 మోటారు వాహన చట్టం, వాహన తయారీ మార్గదర్శకాలలో కూడా అనేక మార్పులు చేయబడ్డాయి. సిగ్నల్ జంపిగ్ నిబంధనలతోపాటు.. సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి సాధారణ నియమాలు ఇప్పుడు భారీ పెనాల్టీని వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే, ఇవి రహదారిపై ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన నియమాలు.. మీరు తెలుసుకోవలసిన నియమాలు చాలా ఉన్నాయి.

స్లీపర్లు లేదా ‘చెప్పులు’ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపకూడదనేది కూడా ట్రాఫిక్ రూల్స్‌లో నియమం. దీని గురించి కొద్ది మందికి మాత్రమే బహుశా తెలుసి ఉంటుంది. వాస్తవానికి ప్రస్తుతమున్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం స్లీపర్లు లేదా ‘చెప్పులు’ ధరించి ద్విచక్ర వాహనాలను నడపకూడదు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు పూర్తిగా మూసి ఉన్న బూట్లు ధరించడం అవసరం. అలా చేయని పక్షంలో రూ.1000 వరకు జరిమానా విధించవచ్చు...


ప్యాంటు, షర్ట్ లేదా టీ-షర్ట్ ధరించడం కూడా తప్పనిసరి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జరిమానా కూడా విధించవచ్చు. ఇది కాకుండా, సాధారణ నిబంధనల గురించి మాట్లాడినట్లయితే.. బైక్‌పై హెల్మెట్ ధరించకపోతే రూ. 1000 జరిమానా ఉంటుంది. అదే సమయంలో బైక్‌కు సంబంధించిన పత్రాలు లేకపోయినా వేల రూపాయల జరిమానా విధించవచ్చు..ఫైన్ పడినప్పుడు ఆలోచించడం కన్నా ముందే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: