కరోనా మహమ్మారి పుట్టిళ్లు అయిన చైనా ఇప్పటికీ ఆ వైరస్‌తో పోరాడుతోంది. కొత్త వేరియంట్‌ను నిలువరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. సరిహద్దులను మూసివేశారు. సామూహిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత వారంలో యూరిపోయన్ యూనియన్‌లో కొత్త వేరియంట్ బారిన పడిన కేసలు 1.5 మిలియన్లకు చేరకున్నాయని WHO ప్రకటించింది. ఇది గత నెలతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. బ్రిటన్‌తో పాటు అనేక దేశాలలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది.అమెరికా అంతటా నమోదవుతున్న యాక్టీవ్ కేసులలో BF.7 బాధితులు 4.6 శాతంగా ఉంది. BA.5, BA.4.6. మొదటి రెండు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్లుగా ఉన్నాయి. వాటి తరువాత స్థానంలో BF.7 ఉంది. అయితే, మరింత మరింత బలపడి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరలోనే ముందున్న రెండు వేరియంట్లను మించిపోతుందని అంటున్నారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.కోవిడ్ వేరియంట్ అయిన BF.7 చాలా ప్రమాదకరం అని పరిశోధకులు చెబుతున్నారు. మరో వేవ్‌కు కారణమయ్యే సామర్థ్యాన్ని ఈ వైరస్ కలిగి ఉందని అంటున్నారు. యూకే ఆరోగ్య భద్రతా సంస్థ కూడా ఇదే విషయాన్ని నివేదించింది.ఇదిలాఉంటే ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) కీలక ప్రకన చేసింది. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చలికాలంలో ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు.ఓమిక్రాన్ BA.5.1.7, BF.7 రూపాంతరాలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయని, మునుపటి రోగ నిరోధక శక్తిని సైతం తట్టుకోగలవని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలోనే చైనాలోని షాంఘై సహా పెద్ద పెద్ద నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. స్కూళ్లు, హాళ్లు, పర్యాటక ప్రదేశాలను క్లోజ్ చేసి, కరోనా టెస్టులను వేగవంతం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: