ఇక తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే అది అటవీ ప్రాంతం.. అందులో కూడా చిరుతలు చాలా ఎక్కువగా తిరిగే ఆవాసాల కేంద్రం.దాదాపు 40 నుంచి 50 పైగా చిరుతలు శేషాచలానే ఆవాసంగా చేసుకొని అక్కడ జీవనం సాగిస్తున్నాయి.సరైన తిండి అందకపోవడం.. జనావాసాల్లో ఉన్న వీధి కుక్కల కోసం మాటు వేసి రాత్రి సమయాల్లో ఆ ప్రాంతంలో తిరుగుతూ .. అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకప్పటి అటవీ ప్రాంతం అయినా ఇప్పుడు అదే పేదల పాలిట ఓ అవాస ప్రాంతం. జీవ లింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని జీవకోనలో భాగంగా ఉన్న బీడీ కాలనీ ఇంకా బ్యాంక్ కాలనీలో చిరుతలు తెగ హడలు పుట్టిస్తున్నాయి.సాయంత్రం ఆరు దాటిందంటే చాలు బయటకు వచ్చే సాహసం చేయడం లేదు ఇక్కడి ప్రజలకి. కేవలం అత్యవసరాల్లో తప్ప అసలు బయటకు వెళ్లాలన్న ఒళ్లంతా కూడా వణుకుతూ చిరుత ఎక్కడా దాడి చేస్తుందో అంటూ బిక్కు బిక్కుమంటూ భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి.


ఇక ఈ చిరుత పులుల సంచారం తిరుపతి వాసులకు అసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. తిరుపతి నగరంలోని వెటర్నరీ యూనివర్సిటీ ఇంకా జీవకోన ప్రాంతాల్లో తరచూ చిరుత పులి సంచారం స్ధానికులకు అలాగే చదువుకునే విద్యార్ధులకు వణుకు పుట్టిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు శేషాచలం అటవీ ప్రాంతానికి అతి దగ్గర్లో ఉండడంతో ఆహార సేకరణకు చిరుత పులులు అక్కడి జన నివాసాలకు వస్తున్నాయి. ఇక జీవకోనలోని ఎల్.ఎస్.నగర్, బ్యాంక్ కాలనీ, మొండికోన ఇంకా బీడీ కాలనీలో ప్రజలు చీకటి పడితే ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు తెగ భయపడుతున్నారు. ఇంకా రాత్రి సమయంలో అయితే కుక్కలను వేటాడేందుకు అటవీ ప్రాంతం నుండి నివాసాలకు వస్తున్న చిరుత పులిని చూసిన కుక్కల అరుపులకు నిద్ర లేకుండా వారు కాలం గడుపుతున్నారు. అయితే మనుషులపై చిరుత పులి దాడి చేయకున్నా.. చిన్న పిల్లలపై దాడి చేసే అవకాశం చాలా ఉండడంతో స్ధానికులు ఆందోళనకు గురి అవుతున్నారు.ఆ చిరుత పులి సంచారాన్ని అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: