తెలంగాణాలో కేసీయార్ పైన మాట్లాడాలంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతగా వణికిపోతున్నారో ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. పార్టీ పెట్టి ఎనిమిదేళ్ళవుతున్నా ఇంతవరకు కేసీయార్ ను వ్యక్తిగతంగా కాదుకదా చివరకు పార్టీ గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. చివరకు ఎంతో ముచ్చటిపడి చేయించుకున్న వారాహి వెహికల్ రిజిస్ట్రేషన్ చేయటానికి తెలంగాణా రవాణాశాఖ ఉన్నతాధికారులు అభ్యంతరాలు చెబితే నోరెత్తి మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయారు.





వాహనం కలర్ తదితరాలపై ఏపీలో మాజీమంత్రి పేర్నినాని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలీని తన యాత్రకోసం ప్రత్యేకంగా పవన్ ఎంతో ముచ్చటపడి ఒక వాహనాన్ని రెడీ చేసుకున్నారు. దానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకున్నారు. దాని ఇంట్రడక్షన్ కూడా సినిమా టీజర్ లెవల్లో చేశారు ట్విట్టర్ వేదికగా. వెంటనే దాని కలర్ పై పేర్నినాని నుండి అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో పవన్ రియాక్టయి నోటికొచ్చింది మాట్లాడారు. పవన్ కు మద్దతుగా నాదెండ్ల మనోహర్ అండ్ కో కూడా వైసీపీపై రెచ్చిపోయారు.





సీన్ కట్ చేస్తే రిజిస్ట్రేషన్ కు తీసుకెళ్ళిన వాహనానంపై రవాణా శాఖ  అభ్యంతరం వ్యక్తంచేసింది. వాహనానికి  మిలిట్రీ ఆలీవ్ గ్రీన్ కలర్ వేయకూడదని, లారీ ఛాసిస్ ఉపయోగించి బస్సుగా తయీరుచేయకూడదని, మైన్స్ లో వాహనాలకు ఉపయోగించే టైర్లు వాడకూడదని, వెహికల్ ఎత్తు కూడా చాలాఎక్కువగా ఉందని ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అభ్యంతరాలన్నింటినీ సరిచేసుకొస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తామని తిప్పిపంపేశారు.





మరి మామూలుగా అయితే పవన్ ఏమిచేయాలి ? కేసీయార్ లేదా కేటీయార్ మీద నోరేసుకుని పడిపోవాలి. కానీ ఇక్కడ అసలు నోరు లేవలేదెందుకని ? వాహనాన్ని తీసుకొచ్చి షెడ్లో పెట్టుకుని చప్పుడుచేయకుండా అన్నీమూసుకుని కూర్చున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాల కారణంగా షర్టు వేసుకోకుండా కూర్చుంటారా ? ఊపిరి తీసుకోవటం ఆపేస్తారా ?  తెలంగాణా ప్రభుత్వం చర్యలకు నిరసనగా పవన్ ఏమి చేయబోతున్నది ట్విట్టర్ వేదికగా చెబితే వినాలని అశేషజనాలు ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: