ఎల్ఐసీ లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. అందులో కొన్ని మంచి లాభాలను అందిస్తున్నారు..కొన్ని పొదుపు పథకాలల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు ఆదాయాన్ని పొందొచ్చు. మరణానంతరం మన కుటుంబానికి భరోసాగా ఉంటుందని నమ్మకంతో కడుతుంటాం.. అయితే చాలా పాలసీలు మరణం సంభవించినప్పుడు ఒకేసారి కవరేజీ అందేలా నిబంధనలు ఉంటాయి..నెల నెలా కవరేజి సొమ్ము వచ్చే పాలసీలు ఉన్నాయని మీకు తెలుసా..ఇలాంటి పాలసీనే ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ ఐసీ స్టార్ట్ చేసింది. బీమా జ్యోతి పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త పాలసీతో సహజ మరణంతో పాటు ప్రమాదవశాత్తూ మరణించినా బీమా ప్రయోజనాలు అందుతాయి.


ఈ పాలసీని ప్రమాదకర వృత్తుల్లో పని చేసే వారు తీసుకుంటే లాభపడతారు.బీమా జ్యోతి పాలసీలో సంవత్సరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ప్రీమియం కడితే పాలసీదారుడి మరణానంతరం అతని కుటుంబానికి నెల నెలా నిర్ధిష్ట మొత్తంలో రూ.1,08,000 వరకూ కవరేజి వస్తుంది. ఈ మొత్తం కవరేజి సొమ్ము పాలసీదారుని వయస్సు, కట్టే ప్రీమియంల మొత్తంపై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. అయితే ఈ పాలసీపై అధిక పెట్టుబడి పెడితే అధిక ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం...


పాలసీదారుడు ఎంత పెద్దవారైతే, వారు మరణించిన సందర్భంలో వారు ఆశించే నెలవారీ ఆదాయం అంత తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 30 ఏళ్ల పాలసీదారుడు సంవత్సరానికి ప్రీమియం రూ. 10 వేల ప్రీమియం చొప్పున 20 సంవత్సరాల కాలానికి కడితే అతని మరణానంతరం కుటుంబానికి వచ్చే నెలవారీ ఆదాయం రూ. 5,000. మరోవైపు, 40 ఏళ్ల పాలసీదారుడు కూడా సంవత్సరానికి రూ. 10 వేల ప్రీమియాన్ని 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, అతని కుటుంబానికి వచ్చే నెలవారీ ఆదాయం రూ.4,500.బీమా జ్యోతి పాలసీ అన్ని తీసుకోవాలంటే దగ్గరలో ఉన్న ఎల్ ఐసీ బ్రాంచ్‌ల్లో సంప్రదించాలి. అలాగే ఎల్ ఐసీ వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంది..ఈ పాలసి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్న ఎల్ ఐసీ బ్రాంచ్‌ల్లో సంప్రదించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: