బీఆర్ఎస్ ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో ఐదుగురు ఎంఎల్ఏల రహస్య మీటింగ్ పార్టీలో ఇపుడు సంచలనంగా మారింది. మైనంపల్లి ఇంట్లో ఎంఎల్ఏలు వివేక్ గౌడ్, ఆరెకపూడి గాంధి, మాధవరం కృష్ణారావు, బీ.సుభాష్ రెడ్డి సమావేశమయ్యారు. వీరి రహస్య భేటీ చాలా ఆలస్యంగా బయటపడింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే తాము సమావేశమయ్యామని, జిల్లాతో పాటు తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న డెవలప్మెంట్లను చర్చించుకునేందుకే భేటీ అయినట్లు చెబుతున్నారు.





అయితే వీళ్ళ మాటలను ఎవరు నమ్మటంలేదు. మంత్రి మల్లారెడ్డితో పాటు కేసీయార్ పైన కూడా వీళ్ళకు బాగా మంటగా ఉన్నట్లు అర్ధమవుతోంది. నియోజకవర్గాల్లో మంత్రి తమ మాటను చెల్లుబాటు కానీయటంలేదన్నది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ. నియోజకవర్గాల్లోని పోస్టులను కూడా మంత్రి తన మద్దతుదారులకే ఇచ్చేసుకుంటే ఇక తామేమి చేయాలని వీళ్ళు మండిపోతున్నారు. జిల్లా లెవల్ పోస్టులూ రాక నియోజకవర్గాల్లోని పోస్టులూ మంత్రే తీసేసుకుంటే ఇక తాము ఎంఎల్ఏలుగా ఉండి ఉపయోగం ఏమిటని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు.





వీళ్ళ వాదన కొంతవరకు బాగానే ఉన్నా అసలు మంత్రి ఎవరిని చూసుకుని ఒంటెత్తుపోకడలకు పోతున్నారు. కేసీయార్ ఇచ్చిన దన్నుతోనే కదా మంత్రి ఎంఎల్ఏలను లెక్కచేయంది. ఈ విషయం ఎంఎల్ఏలకు తెలీకుండానే ఉంటుందా ?  కేసీయార్ మంచోడు మంత్రి మాత్రమే దుర్మార్గుడా వీళ్ళ దృష్టిలో.  మల్లారెడ్డి చేస్తున్న వ్యవహారాలు కేసీయార్ కు తెలీకుండానే ఉంటుందా ?





కాబట్టి మంత్రిపైన వీళ్ళు మండుతున్నది కరెక్టే కానీ పనిలోపనిగా కేసీయార్ పైన కూడా వీళ్ళు బాగా అసంతృప్తిగానే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళంతా బీఆర్ఎస్ లోకి టీడీపీ, కాంగ్రెస్ నుండి  వలస వచ్చిన నేతలే. తాజా డెవలప్మెంట్లను బీజేపీ చాలా జాగ్రత్తగా గమనిస్తోందట. ఇప్పటికే ఎంఎల్ఏల కొనుగోలు వ్యవహారంలో బాగా అప్రదిష్టమూటకట్టుగున్న కారణంగా ఇప్పటికిప్పుడు వీళ్ళపైకి వల విసిరే అవకాశం తక్కువనే అనుకోవాలి. కాకపోతే వీళ్ళంతట వీళ్ళుగానే బయటపడేంతవరకు బీజేపీ వెయిట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: