
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు రాఘవరావు చేసిన ఘనకార్యం గురించి తెలిసిందే. ఈయన జనసేన పార్టీలో ఉన్న కీలక నాయకులు నాదెండ్ల మనోహర్ మరియు నాగబాబులకు సుపరిచుతుడని తెలిసిందే. వివిధ సమయాలలో వీరితో ఫోటోలు కూడా తీసుకున్నవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే రాఘవరావు చినవాల్తేరులోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న ఒక మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ , ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేక మానసికంగా బాధపడుతూ ఉండేది.
అయితే ఈ సైలెన్స్ ను అనువుగా తీసుకున్న రాఘవరావు నీతో మాట్లాడాలి రూమ్ కు వస్తావా ? నువ్వంటే ఇష్టం ... నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న వరకు విషయం వెళ్లిందట. దీనితో కోపోద్రిక్తులైన అమ్మాయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రఘ్వరావు పై ఐపీసీ సెక్షన్ 354 , 509 మరియు 427 ల కింద కేసును నమోదు చేశారు. ఇది కాస్తా గత మూడు రోజుల నుండి వైరల్ గా మారింది. అందుకే జనసేనను ఉద్దేశించి అందరూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పవనన్న ఇలాంటి వాళ్ళను పార్టీలో పెట్టుకుంటే జనసీకు ఉన్న విలువ కూడా పోతుంది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మీ పార్టీలో చోటు ఇవ్వొద్దు అంటూ జనసైనికులు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.