తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై చాలా వ్యతిరేకత ఉన్నదా ? తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ సమావేశంలో  ఎర్రబెల్లి మాట్లాడుతు 25 మంది ఎంఎల్ఏలపైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. మంత్రిచేసిన తాజా వ్యాఖ్యలు పార్టీతో పాటు జనాల్లో కూడా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో చాలామందిపైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎప్పటినుండో వినిపిస్తున్న మాటే.





ఒకటికి పదిసార్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్ధ  ఐప్యాక్ చేసిన సర్వేలో కూడా ఇదే విషయం బయటపడిందట. ఐప్యాక్ సర్వేలో సుమారు 60-70 మంది ఎంఎల్ఏలపైన వ్యతిరేకత ఉందనే విషయం బయటపడిందని సమాచారం. అయితే ఇపుడు ఎర్రబెల్లి మాత్రం 25 మంది ఎంఎల్ఏలపైనే అని చెప్పారు. మంత్రే 25 మంది ఎంఎల్ఏలపైన జనాల్లో వ్యతిరేకత ఉందని బహిరంగంగా చెప్పారంటే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందనేది పార్టీలో టాక్.





ఎంఎల్ఏల్లో వ్యతిరేకత గురించే మంత్రి చెప్పారు. మరి మంత్రులపైన ఉన్న వ్యతిరేకత మాటేమిటి ? డైరెక్టుగా కేసీయార్ మీదే జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత మాటేమిటి ? అన్నీ కలిపి హోలు మొత్తంమీద ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేస్తున్నాయి. అంటే సర్వేలో  ఐప్యాక్ బృందం చెప్పిన విషయాలు కరెక్టేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరింతమంది ఎంఎల్ఏలు, మంత్రుల మీద వ్యతిరేకత పెట్టుకుని కూడా మళ్ళీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి చెబితే నమ్మటం ఎలాగ ?





పైగా వ్యతిరేకత ఉన్న 25 మంది ఎంఎల్ఏలను మారిస్తే పార్టీకి 90 సీట్లు గ్యారెంటీనట. బీఆర్ఎస్ గెలిచేస్ధానాలు 100 దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదని ఎర్రబెల్లి చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కేసీయారో లేకపోతే ఎర్రబెల్లో చెప్పినట్లుగా కనిపించటంలేదు. కాంగ్రెస్, బీజేపీలు బలపడే కొద్దీ చివరకు హంగ్ అసెంబ్లీ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇదే జరిగితే బీజేపీ ఫుల్లు హ్యాపీస్ అనే చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: