
అదే కాదు ఇలా దేశం కోసం సేవ చేసిన శునకాలకు ఇక ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే దేశసేవ చేస్తూ ఇక అమరులైన శునకాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని శునకాలు మాత్రం ఇక ఆర్మీలో పని చేసిన తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ లాగానే రిటైర్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా రిటైర్మెంట్ తీసుకున్న శునకాలను ఏం చేస్తారు అన్నది అందరిలో ఉండే ఒక ప్రశ్న. అయితే ఒకప్పుడు ఇలా ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న శునకాలను చంపేసేవారట. గాయపడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న క్షణకాలం మెర్సి కిల్లింగ్ పేరుతో ప్రాణాలు తీసే వారట. ఎందుకంటే ఇక శునకాలకు ఆర్మీకి సంబంధించిన అన్ని రహస్యాలు తెలిసి ఉంటాయి. అలాంటి శనకాలు శత్రువుల చేతికి చిక్కితే ఇక దేశ శాంతి భద్రతకు ఆటంకం కలుగుతుందని ఇక వాటిని చంపేసేవారట. కానీ 2015 తర్వాత ఈ పద్ధతిని పక్కకు పెట్టేసారు.
2015 తర్వాత ఆర్మీలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించి రిటైర్మెంట్ అయిన శునకాలను ప్రత్యేకంగా మీరట్ లోని ఆశ్రమాలకు పంపుతున్నారు. అంతేకాకుండా ఆర్మీలో భాగమైన గుర్రాలను కూడా ఉత్తరాఖండ్లోని హేంపూర్ ఆశ్రయానికి అధికారులు పంపుతారట. అక్కడ ప్రత్యేక శ్రద్ధతో ఇక ఆ జంతువులు మరణించేంతవరకు కూడా సంరక్షణ బాధ్యతలు మొత్తం ఇక అధికారులు చూసుకుంటారట.