ఇపుడీ విషయమే రాజకీయాల్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం ఒకమాట చెప్పిన కేంద్రమంత్రి సాయంత్రానికి మాట మార్చేశారు. రెండు సందర్భాల్లో చెప్పిన మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. దాంతో మంత్రి చెప్పిన మాటల్లో ఏదికరెక్టో జనాలకు అర్ధంకావటంలేదు. అందుకనే సాయంత్రానికి ఉక్కుమంత్రిని వెనక్కులాగింది ఎవరనే విషయమై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఉదయం వైజాగ్ స్టీల్స్ ను సందర్శించారు.





తర్వాత మీడియాతో మాట్లాడుతు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయాన్ని పక్కనపెట్టినట్లు చెప్పారు. సంస్ధను ఎలా బలోపేతం చేయాలన్నదే తమ తక్షణ కర్తవ్యమన్నారు. మంత్రి చెప్పిన ప్రకారం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం పక్కకు పెట్టేసినట్లు అర్ధమైంది. ఇదే విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో క్రెడిట్ ను బీఆర్ఎస్ క్లైం చేసుకోవటం మొదలుపెట్టింది. తమ ఒత్తిడిని తట్టుకోలేకే నరేంద్రమోడీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను పక్కన పెట్టేశారంటు మంత్రులు కేటీయార్ , హరీష్ రావు గోలగోల చేశారు.





మధ్యాహ్నంపైన కార్మిక, ఉద్యోగసంఘాల నేతలను వెంటపెట్టుకుని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రమంత్రిని కలిశారు. అపుడు కులస్తే మాట్లాడుతు ప్రైవేటీకరణను పక్కన పెట్టినట్లు చెప్పే అధికారం తనకు లేదన్నారు. ఆ విషయాన్ని చెప్పాల్సింది కేంద్ర క్యాబినెట్ మాత్రమే అని యూటర్న్ తీసుకున్నారు. దాంతో విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. దీనిపైన శుక్రవారం కేంద్రం క్లారిటి ఇచ్చింది.  ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గలేదని చెప్పింది.





ఉదయం మాట్లాడిన మాటలకు సాయంత్రం చెప్పిందానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే ఈమధ్యలో కులస్తేని వెనక్కు లాగింది ఎవరు ? అనేదిపుడు చర్చనీయాశమైంది. నిజానికి ఉదయం మంత్రి చెప్పినపుడు కొందరికి అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రైవేటీకరణను పక్కన పెడుతున్నట్లు చెప్పటమంటే చాల పెద్ద విషయం. ఇంత పెద్ద విషయాన్ని సీనియర్ మంత్రులెవరైనా చెబుతారు లేదా హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు ప్రకటిస్తారు. అంతేకానీ జూనియర్ మంత్రి కులస్తేతో ప్రకటనచేయించరు. మరి కులస్తే ప్రకటన చూసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం లేదా బీజేపీ కీలక వ్యక్తులెవరైనా కులస్తేతో మాట్లాడారా  అన్నదే అనుమానంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: