జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి 175కి 175 సీట్లను ఎలా గెలుచుకోవాలా అని వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు వచ్చేఎన్నికల్లో అధికారంలోకి ఎలా రావాలా అని చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మధ్యలో పవన్ మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. పవన్ ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం ఏమిటి ?





ఏమిటంటే చాలా సింపుల్, మొత్తం పార్టీ భారమంతా చంద్రబాబు మీద వదిలేయటమే. ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి రావాలన్న కోరికలేదు. తాను పోటీచేసే నియోజకవర్గంలో గెలవాలన్న పట్టుదలలేదు.  ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలనే విషయంలో ఆరాటంలేదు. ప్రచారంచేసి అభ్యర్ధుల గెలుపుకు కష్టపడాలన్న చింతలేదు. అభ్యర్ధుల ఎంపికను అసలు పట్టించుకోవటమే లేదు. ఎందుకంటే మొత్తం చంద్రబాబు చూసుకుంటారు.





అవును, పొత్తు పెట్టేసుకుంటే చాలు జనసేన ఎన్ని సీట్లలో పోటీచేయాలి ? పోటీచేయాల్సిన నియోజకవర్గాలు ఏవి ? అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, ఖర్చు ఇలా సమస్తం చంద్రబాబుదే బాధ్యత. అందుకోసమే సినిమాల షూటింగుల్లో పవన్ హ్యాపీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాలి. 24 గంటలూ, 365 రోజులూ జనాల్లోనే ఉండాలి. అంత ఓపిక, తీరిక పవన్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే షూటింగుల గ్యాప్ లో పార్టీ మీటింగులు, బహిరంగసభలు పెట్టుకునే పవన్ నుండి ఎవరైనా ఇంతకన్నా ఏమి ఆశించగలరు ?





జనసేన నిర్వహణ బాధ్యతను చంద్రబాబు చేతుల్లో పెట్టేస్తే మొత్తం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే చూసుకుంటారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినపుడు షూటింగులకు గ్యాప్ ఇచ్చి అప్పుడు కాస్త హడావుడి చేస్తే చాలని పవన్ అనుకున్నట్లున్నారు. అందుకనే పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇపుడు నాదెండ్ల మనోహర్ కు ఇచ్చారు. ఎందుకంటే పార్టీ తరపున ఎవరో ఒకళ్ళు జనాల్లో అప్పుడప్పుడన్నా కనబడాలి కదా. కొద్దిరోజుల తర్వాత బాధ్యతలు చంద్రబాబుకు షిఫ్టవుతాయి. అప్పుడు ఆల్ హ్యాపీస్ అనే పద్దతిలో ఇపుడు పవన్ వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: