శ్రీకాకుళం పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే సెప్టెంబర్ నుండి విశాఖపట్నంలోనే తాను కాపురం ఉండబోతున్నారట. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే తాను విశాఖకు వచ్చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి మూడురాజధానుల వివాదం సుప్రింకోర్టు విచారణలో ఉంది. కోర్టు విచారణలో ఉన్న అంశాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ అందరు అన్నీ అంశాలపైనా మాట్లాడేస్తున్నారు.





ఇందులో భాగంగానే జగన్ కూడా సెప్టెంబర్ నుండే విశాఖకు వచ్చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ కూర్చుని పాలన చేయాలన్నది పూర్తిగా జగన్ ఇష్టమే. ఇందులో ఎవరు అభ్యంతరం చెప్పేందుకు లేదు. కోర్టులు కూడా అడ్డుకునేందుకు లేదు. ఈ విషయం తెలుసుకాబట్టే తాను వైజాగ్ వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడే రెండు విషయాలున్నాయి. అవేమిటంటే సెప్టెంబర్లోగా సుప్రింకోర్టులో కేసు విచారణ జరిగి తీర్పు అనుకూలంగా వస్తే హ్యాపీగా అధికారికంగానే జగన్ వైజాగ్ వచ్చేస్తారు. జగన్ కు ఏదైనా ఒకటే.





ఒకవేళ మూడురాజధానుల విషయంలో తీర్పు వ్యతిరేకంగా వస్తే ? వచ్చినా నష్టంలేదు జగన్ మాత్రం విశాఖపట్నంకు మారిపోతారు. వ్యతిరేకత తీర్పువస్తే ప్రతిపక్షాల ఓర్వలేని తనంవల్లే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ కాలేదని చంద్రబాబునాయుడు అండ్ కో పై బాధ్యతను నెట్టేస్తారు. ఇది వాస్తవం కాబట్టి జనాలు కూడా కాదనేందుకు లేదు. రేపటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, కర్నూలులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను బూచిగా చూపించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తారు.





జగన్ వాదనతో ఏకీభవించే వాళ్ళు చంద్రబాబు, పవన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఏకీభవించని వాళ్ళు ఏమిచేస్తారో వాళ్ళిష్టం. మొత్తానికి విశాఖకు ఫిష్టయ్యే విషయంలో లాభనష్టాలు అన్నీ ఆలోచించుకున్న తర్వాతే జగన్ బహిరంగంగా ప్రకటించినట్లు అర్ధమైపోతోంది. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపు సుప్రింకోర్టులో కేసు ఎప్పటికి తెములుతుందో తెలీదు. ఈ నేపధ్యంలోనే జగన్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు అర్ధమవుతోంది. మరీ స్టెప్ వైసీపీకి ప్లస్సవుతుందో లేకపోతే మైనస్సవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: