ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో టిడీఎల్పీ సమావేశం జరిగింది. ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో షాక్ అవడం చంద్రబాబు వంతయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలు కూడా సమావేశానికి హాజరు కాలేదు. 
 
ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోగా ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని తీర్మానం చేసిన గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ లు సమావేశానికి హాజరు కాకపోవడం ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి ఈ ఇద్దరు ఎందుకు హాజరు కాలేదనే విషయం గురించి స్పష్టత రావాల్సి ఉంది. 
 
వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ విశాఖకు చెందిన తెలుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తీర్మానం చేయగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకంగా తీర్మానం చేసే విషయంలో వ్యవహరించారు. ఆ తరువాత ఆ తీర్మానాన్ని విశాఖ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి పంపారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అమరావతి రైతులను ఆదుకోవాలని తీసుకున్న నిర్ణయానికి కూడా గంటా శ్రీనివాసరావు తన మద్ధతు ప్రకటించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించటానికే టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైతే విశాఖ జిల్లా వాసుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి ఈ సమావేశానికి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ హాజరు కానట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకపోవటం చంద్రబాబుకు షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: