రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు వైసీపీ కీలక నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే రోజా. రెండు రోజులుగా ఏపీలో మద్యం వ్యవహారంపై టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై రోజా అంతే స్థాయిలో స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లు తాగిన కోతుల్లా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తమకు నచ్చిన బ్రాండ్స్ లేవని టిడిపి నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడులా మాట్లాడుతున్నారు అంటూ రోజా విమర్శించారు. 

IHG


శాసనసభలో మహిళా ఎమ్మెల్యేతో మద్యం బ్రాండ్స్ గురించి మాట్లాడించడం తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దశల వారీగా మధ్య నిషేధం అమలు చేయాలని జగన్ చూస్తున్నారని, అందుకే మద్యం విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని కానీ టీడీపీ నేతలు ఈ విషయంపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, మద్యం ధరలు పెంచితే నిత్యావసరాల ధరలు పెంచినట్లు టిడిపి నాయకులు బాధ పడిపోవడం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టారు. టీడీపీ హాయాంలో ఒక్క బెల్ట్‌ షాపు అయినా తగ్గించారా అని రోజా ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక 20 శాతం షాపులను తగ్గించారని ఆమె అన్నారు.

IHG


టీడీపీ నాయకుడు బొండా ఉమా మద్యం  షాపులో వర్కర్ లా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, టిడిపి కార్యాలయాలను లోకేష్ మద్యం దుకాణాలుగా మార్చాలని ఆమె ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళల తాళిబొట్లు తెంచడమే ధ్యేయంగా ఇష్టమొచ్చినట్టుగా పెంచిన ఘనత టిడిపి నాయకులకు చెందుతుందని విమర్శలు చేశారు. బీరుని హెల్త్ డ్రింక్ గా ప్రకటించిన ఘనత తెలుగుదేశం నాయకులకే చెల్లుతుందని రోజా ఎద్దేవా చేసారు. సీఎం జగన్ చేస్తున్న ప్రజా పాలనా చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక ఇలా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: