జీవితంలో చాలా మంది మనుషులు జైలుకు గాని హాస్పిటల్ కి గాని వెళ్ళకూడదు అని అనుకుంటారు. పొరపాటున అటువంటి పరిస్థితులు వచ్చినా గానీ మనుషులు చాలా వరకు కాంప్రమైజ్ అవ్వటానికి రెడీ అవుతారు. పొరపాటున జైల్లో కి వెళ్లి సమాజం లోకి వచ్చాడు అంటే మన దేశంలో ఆ వ్యక్తిని చాలా క్రూరంగా మనుషులు భావిస్తారు. ఆ విధంగా మన దేశంలో జైలు జీవితం ఉంటుంది. కానీ మనం నివసిస్తున్న ఈ భూమిపై ఒక దేశంలో ఉన్న జైలు చాలా బంగారంలాంటి జైలు అని ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో బయటపడింది. ఆ జైలులో ఉన్న వసతులు మరియు సిబ్బంది ఖైదీలను వ్యవహరించే తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ జైలు గురించి వింటే ఒక రోజైనా గడపాలని అనిపిస్తుంది.

 

ఇంతకీ ఆ జైలు ఎక్కడ ఉందో ఒకసారి తెలుసుకుందాం. నార్వేలోని బాస్టాయ్ జైలు అది. పెద్ద పెద్ద గోడలు, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, ఖైదీల కోసం చీకటి రూములు, సెక్యూరిటీ.. ఇలాంటివేమీ ఆ జైలులో కనిపించవు. ఎందుకంటే.. ఏ ఖైదీ పారిపోవడానికి ప్రయత్నించడు కాబట్టి. జైలులో ఉండే అధికారులు, పోలీసులు, ఖైదీలు అంతా ఒకే సమయపాలన పాటిస్తారు. పొద్దున్నే అంతా లేస్తారు. అందరూ ఎక్సర్ సైజ్ చేస్తారు. తర్వాత టిఫిన్ చేసి.. పక్కనే ఉన్న బీచ్ కు వెళ్లి కాసేపు సేదతీరుతారు.

 

ఆ తర్వాత వెంటనే జైల్లో కి వచ్చి రెడీ అయ్యి ఖైదీ లో ఎవరి పనులకు వారు వెళ్తారు. ఈ సమయంలో వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం, పశువులు కాసేవాళ్లు పశువులు జైలు చుట్టుప్రక్కల పెంచుతారు. అదే సమయంలో తర్వాత ఎవరికి నచ్చిన వంట చేసుకుని తింటారు. మళ్లీ తమ పనులు చేసుకుంటారు. సాయంత్రం ఓసారి మళ్లీ బీచ్ లో గడుపుతారు. రాత్రి భోంచేసి పడుకుంటారు. ఇదే ఆ జైలులోని ఖైదీల దైనందిన జీవితం. అయితే ఈ జైల్లోకి పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కాదు చిన్నచిన్న నేరాలు చేసి వచ్చిన వాళ్ళను మాత్రమే తీసుకుంటారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: