కరోనా ను తరిమికొట్టాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది.. ఇక కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు కూడా శ్రమిస్తున్నాయి.. ఇకపోతే చాలా రోజుల నుంచి కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు..ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.. అయినా కరోనా పెరగడంతో ప్రజలు లాక్ డౌన్ ను మరింత పొడిగించారు.. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు..

 

 


కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడం కోసం ముందుకొస్తున్నారు. 

 

 


ఇది ఇలా ఉండగా కరోనా ప్రభావం కొంత వరకు తగ్గుముఖం పట్టడంతో మూతపడ్డ అన్నీ తెరచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారు మరో నెల ఆగాల్సిందేనని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తెరిచే అంశాన్ని జూన్‌ తర్వాతే పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

 

 

 

జూన్‌ నెలకు సంబంధించి కరోనా కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను తెరిచే అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి జవదేకర్ తెలిపారు. కొవిడ్‌-19, లాక్‌డౌన్ ప్రభావంతో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తదితర సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయి. మరో నెలలో అన్నీ స్వచ్చందంగా తెరవనున్నాయని సినీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: