ప్రస్తుతం గాల్వన్ లోయలో  చైనా భారత్ మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో చైనా యాప్స్ తో భారత  భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ  చైనా కు సంబంధించిన 59 యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. చైనా కు సంబంధించిన యాభై తొమ్మిది యాప్స్ నీ  నిషేధించినప్పటికీ ప్రస్తుతం నెటిజన్లు అందరూ  నిషేదానికి  గురయిందని బాధ పడుతున్న యాప్  మాత్రం టిక్ టాక్ అనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో టిక్ టాక్ ఫాలోవర్స్ ఎంతోమంది ఉన్నారు. సరికొత్త వినోదాన్ని తెరమీదికి తెచ్చి  ఎంతోమందిని ఆకర్షించి వేల కోట్ల సంపద భారత్ నుంచి సంపాదించింది చైన.

 

 ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో రోజుల నుంచి నిమగ్నమైన టిక్ టాక్ నిషేదానికి  గురి కావడంతో ప్రస్తుతం టిక్ టాక్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఎందులో దొరుకుతుంది అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్టాక్ నిషేధానికి గురి కావడంతో రొపొసొ మరియు చింగారి  యాప్ కు  ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. టిక్ టాక్ లో లభించే ఎంటర్ టైన్ మెంట్ కు చింగారి లో  లభించిన ఎంటర్టైన్మెంట్ దాదాపుగా ఒకే లాగ ఉండడంతో ప్రస్తుతం నెటిజన్లంలందరూ ఈ రెండు యాప్స్ కి  కనెక్ట్ అయి పోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యాప్ డౌన్లోడ్స్ పెరిగిపోతున్నాయి. 

 

 టిక్ టాక్ స్థానాన్ని ఈ రెండు యాప్లు భర్తీ చేయడం ఖాయమని చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా చింగారి  యాప్ అయితే వేగంగా టిక్టాక్ బదులుగా ప్రత్యామ్నాయంగా దూసుకుపోతుంది. ఎంతో మంది బడా బడా వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు సైతం ఈ యాప్ ని  ఇన్స్టాల్ చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం చింగారి  ఎంత స్పీడ్లో దూసుకు పోతుంది అంటే గంటకు మూడు లక్షల మంది సరికొత్త వినియోగదారులు  యాప్ కి వస్తున్నారు. ఇక ప్రస్తుతం రోపోసో కూడా గతంలో ఆరున్నర కోట్ల వినియోగదారులతో ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య పది కోట్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: