కరోనా మహమ్మారి కారణంగా బడా వ్యాపారుల నుంచి చిరు వ్యాపారాలు చేసుకునే వారి వరకూ చాలా మంది నష్టపోయిన విషయం తెలిసిందే. రోడ్ల పక్కన టీ పాయింట్లు నడుపుకునే వ్యాపారులు, చెప్పులు కుట్టే వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు ఇలా లాక్ డౌన్ లో చాలా మంది చిరు వ్యాపారులు నష్టపోయారు. తమని ఎవరైనా ఆదుకుంటే బాగుంటుందని ఆశగా చూసిన వ్యాపారులకి కేంద్రం భరోసా ఇచ్చింది. కరోనా కారణంగా దెబ్బ తిన్న వీధి వ్యాపారులకు అండగా ఉంటామని చెప్పిన మోదీ సర్కార్, జూన్ ఒకటిన  పిఎం స్వనిధి (స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు 10 వేల రూపాయల చొప్పున ఋణాలు అందజేస్తామని కేంద్రం ప్రకటించింది.



దేశం మొత్తం మీద 24 లక్షల మంది వ్యాపారస్తులు దరఖాస్తు చేసుకోగా, ఒక్క ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచే 5 లక్షల 57 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 లక్షల మందిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం  లబ్దిదారులుగా గుర్తించింది. ఇప్పటివరకూ 5.35 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన మూడు లక్షల మంది లబ్దిదారులకు రేపే ఋణాలు అందజేయనుంది కేంద్రం. రేపు వర్చ్యువల్ మీట్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు స్వయంగా లబ్దిదారులకు రుణాలు అందజేయనున్నారు. ఆ తర్వాత వ్యాపారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: