ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అసెంబ్లీలో అధికార పక్షంగా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీదే పైచేయి అవుతుంది. వారు ఓ రేంజ్‌లో టీడీపీని ఆడేసుకుంటున్నారు. అయితే టీడీపీ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే టీడీపీ కూడా ధీటుగానే స్పందిస్తుంది.

టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఘాటుగానే మాట్లాడుతున్నారు. అధికార పక్షానికి గట్టిగానే సవాళ్ళు విసురుతున్నారు. కాకపోతే అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడంలో భాగంగా అసెంబ్లీ ద్వారా రాంగ్ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సీఎం జగన్ ప్రత్యేకంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని టార్గెట్ చేశారు. సభలో నిమ్మల మాట్లాడుతూ..జగన్ అధికారంలోకి వస్తే మూడు వేల పింఛన్ ఇస్తాను అన్నారు ఎక్కడ? అని ప్రశ్నించి, మళ్ళీ 45 ఏళ్ల బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్ ఇస్తాను అన్నారు అది ఏమైందని నిలదీశారు.

దీంతో దీనికి డైరక్ట్‌గా సీఎం జగన్ లేచి నిమ్మలకు కౌంటర్ ఇచ్చారు. అసలు టీడీపీ నేతలకు అబద్దాలు చెప్పడమే పని అని, తాము మేనిఫెస్టోలో ఏమి పెట్టమో అలాగే చేసుకుంటా వస్తున్నామని, వీరికి ఎన్నిసార్లు చెప్పిన అర్ధం కావడం లేదని మండిపడ్డారు. రామానాయుడు డ్రామా నాయుడుగా మారారని, సభలో రోజూ అబద్ధాలు మాట్లాడుతున్నారని, రామానాయుడికి సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని, రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశంతో అబద్ధాలు చెబుతున్నారని, అసత్యాలు చెప్పేవారిని సభలో బ్యాన్ చేయాలని, తమ మేనిఫెస్టో రెండు పేజీలే ఉంటుందని, 2018 సెప్టెంబర్‌-03న చెప్పిన మాటనే మేనిఫెస్టోలో పెట్టామని మాట్లాడారు. వచ్చే జూలై-08న పింఛన్ రూ. 2,250 నుంచి 2,500కు పెంచుతామని జగన్ చెప్పారు. అయితే రామానాయుడు ఇప్పుడే కాదు పలు అంశాల విషయంలో ఏదొక విధంగా పథకాల విషయంలో రాంగ్ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకే జగన్ ఇంత సీరియస్ అయ్యి, రామనాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: