ఏకైక అమరావతి రాజధానిగా మార్చడానికి జగన్ సర్కారు అలాగే వైసిపి నాయకులు చెబుతున్న ఏకైక కారణం అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్. కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో నిన్న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నిజానికి మీడియా ఎక్కువగా ఈ విషయాన్ని ఫోకస్ చేయనప్పటికీ ఈ తీర్పులో ఉన్న అంశాలు చూస్తే ప్రభుత్వం రాజధాని మార్చాలని ఏకైక దృక్పథంతో కుట్రపూరితంగా వ్యవహరించిన విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన హైకోర్టు మొత్తం 85 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది. 

నిజానికి ప్రభుత్వ వాదన ఏమిటంటే ఫలానా చోట రాజధాని వస్తుంది కాబట్టి అక్కడ భూములు కొనుక్కోమని అప్పటి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమకు కావాల్సిన వారికి ముందుగానే సమాచారం ఇచ్చి అక్కడ భూములు కొనుగోలు చేశారని. ఈ విషయం మీద కోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది. భూములు కొనుగోలు చేయడం భారత పౌరుడు రాజ్యాంగ హక్కు అని, ఇక్కడ భూముల్ని అమ్మకందారులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారని ఈ అమ్మకాల్లో రిజిస్టర్ అలాగే సేల్ డీడ్స్ రెండూ ఉన్నాయని ఈ సందర్భంలో ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు క్రిమినల్ నేరాల కిందకు రావని తేల్చి చెప్పింది. 

అంతేకాక ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే దానికి ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు కట్టలేమని తేల్చి చెప్పింది. ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా వారు ఎప్పుడూ చెప్పే విషయం అమరావతి అనేది ఒక కులానికి చెందిన రాజధాని అని అలాగే అక్కడ చంద్రబాబు వర్గీయులు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని. అయితే ఎక్కడా ఒక కులానికి రాజధాని ఉండడం అనేది జరగదు. 

ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులు సైతం అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఈ కుల రాజధాని అనేది రాజకీయ విమర్శ అని ఇప్పటికే జనానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరగలేదని తేల్చేసిన క్రమంలో ఇప్పుడు జగన్ ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్న జగన్ ఈ అంశం మీద సిబిఐ విచారణ చేయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ సీబీఐ చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: