హీరో అన్న రెండక్షరాలు చాలా చిన్నవి కానీ. వాటి బరువు పరువు చాలా ఎక్కువే. ఏపీలో ఇపుడు అసలైన హీరో ఎవరు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని అంతా ఒక్క మాట చెబుతున్నారు. నిమ్మగడ్డ లో మరో శేషన్ ఉన్నాడన్న సంగతి ఇప్పటికి తెలిసింది అనే వారూ ఉన్నారు. రాజ్యాంగంలో అన్నీ రాసి  ఉన్నాయి.

హక్కులు ఎన్నో కూడా అక్కడ పొందుపరచారు. కానీ వాటిని వాడుకున్న వారే హీరోలుగా ఉంటారు. నిమ్మగడ్డ విషయం తీసుకుంటే ఆయన కచ్చితంగా హీరో అంటున్నారు. 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టి తనకు ఎదురులేదు అనిపించుకున్న జగన్ ని ఆయన జగ మొండి తనాన్నే సవాల్ చేసి తాను అనుకున్నట్లుగా ముందుకు సాగిన నిమ్మగడ్డ కంటే హీరో ఎవరు అన్న మాట అయితే వినిపిస్తోంది.

నిమ్మగడ్డ గత ఏడాదిగా జగన్ సర్కర్ మీద పోరాడారు. ఇది ఏపీలోనే కాదు, దేశ చరిత్రలో నిలిచిపోయే అధ్యాయం అంటున్నారు. సాధారణంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారులు ప్రభుత్వంతో కలసి పనిచేస్తూంటారు. ప్రభుత్వం కూడ ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థను సప్రదించినట్లుగా ఉంటూనే  తమ పై చేయిని సాధించుకుంటుంది.
దేశంలో కూడా ఇప్పటిదాకా అదే అమలవుతోంది.  ప్రభుత్వం కోరుకున్నట్లుగానే ఎన్నికలు జరుగుతాయి. కానీ ఏపీలో మాత్రం నిమ్మగడ్డ రాజ్యాంగం ప్రకారం తనకున్న పూర్తి హక్కులను కాపాడుకున్నారు. ఆయన ఈసీ అంటే ఏంటో   శేషన్ తరువాత మళ్ళీ ముప్పయ్యేళ్లకి  జగన్ సర్కార్ కి కచ్చితంగా బోధపడేలా చేశారని, రాజ్యాంగ సంస్థలతో  పోరు అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదని పక్కా క్లారిటీగా తెలియచెప్పారని కూడా అంటున్నారు.

అంతే కాదు నిమ్మగడ్డ పూర్తి అవగాహనతోనే న్యాయ పోరాటం చేశారు అంటున్నారు. ఆయన న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. ఇది ఇపుడు ఆయనకు అక్కరకు వచ్చింది. నిమ్మగడ్డ తెగింపు ధోరణి, ఆయన వైసీపీ సర్కార్ కి ధీటుగా ఎదిరించిన వైఖరి, న్యాయ స్థానాల్లో ఆయన పోరాడిన తీరు ఇవన్నీ కూడా ఇపుడు దేశమంతటా చర్చకు వస్తున్నాయి. మొత్తానికి నిమ్మగడ్డ వర్సెస్ వైసీపీ సర్కార్ అన్న ఎపిసోడ్ లో విజేతగా నిలిచి నిమ్మగడ్డ హీరో అయ్యారు. గత ఏడాది ఆయన స్థానిక  ఎన్నికలను వాయిదా వేశారు, ఇపుడు ఆయన అదేశం మేరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసీ పవర్స్ ఏంటో తెలిసి ఫుల్ గా వాడుకున్న నిమ్మగడ్డ కటౌట్ కి ఇమేజ్ కి ఇపుడు ఏపీలో యూత్ కూడా ఫిదా అవుతున్నారుట.

మరింత సమాచారం తెలుసుకోండి: