ముస్లిములు జరుపుకునే పెద్ద పండగలలో రంజాన్ ఒక్కటి. ఈ పండగకు నెల రోజుల ముందే నుండే కఠిన ఉపాసలు ఉంటారు. ఇక ప్రతి మాసంలోను శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్‌ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్‌ మాసంలో మత పెద్దలతో నమాజ్‌ చేయించడం ప్రశస్తమైనది. మసీద్ కు వెళ్ళలేనివారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్‌ ఆఖరు పది రోజులు ఇళ్ళు వదలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్‌ గురించి ప్రార్థనలతో ఆథ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. రంజాన్‌ పండుగను ఈదుర్‌ ఫితర్‌ అని అంటారు.

అయితే నెల పొడుపు చంద్రుని దర్శించిన తరువాత రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్‌ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకొనుటకు 'అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు.

కాగా.. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. నేటితో వీరి నెలరోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలురకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న వారు ఉపవాసదీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతిఉంది.

అలాగే ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం నూటికి రెండు రూపాయలు అయినా దానధర్మం చేయాలని భావిస్తారు, పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలినవి దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. రంజాన్‌ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఈ దానధర్మ గుణం ,భక్తి భావాన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: