ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.ఈ స‌మావేశంలో రాష్ట్రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. క‌రోనా మొద‌టి ద‌శ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో అనేక మంది చనిపోయార‌ని..చ‌నిపోయిన వారిని ప్ర‌భుత్వం ఆదుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.క‌రోనా మృతుల‌కు ప్ర‌భుత్వం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారం త‌క్ష‌ణం చెల్లించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.దీంతో పాటు క‌రోనా కార‌ణంగా చేతి వృత్తుల వారు,రోజువారీ ప‌నులు చేసుకుని బ్రతికే వారికి ఉపాధి లేకుండా పోయింద‌న్నారు.వారికి కూడా 10వేల రూపాయ‌లు ఆర్థిక‌సాయం చేయాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

మొత్తం ప‌ది డిమాండ్ల‌తో ఈ నెల 16 నుంచి 22 వ‌ర‌కు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు నాయ‌కుల‌కు, కార్య‌కర్త‌ల‌కు పిలుపునిచ్చారు. 16న‌ తహసీల్దార్‌ కార్యాలయాలల్లో విజ్ఞాపన పత్రాలు స‌మ‌ర్చించ‌డం,18న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో విజ్ఞాప‌న ప్ర‌తాలు అందించ‌డం,20న కలెక్టర్‌ కార్యాలయాల్లో విజ్ఞాప‌న ప్ర‌తాలు ఇవ్వ‌డం,22న 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారని టీడీపీ నాయకులు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ఇప్ప‌టికి దాన్యం కొన్ని చోట్ల త‌డిసి మొల‌క వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకువ‌చ్చారు.

రైతులు పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌ని చంద్ర‌బాబు నాయ‌కుల‌కు సూచించారు..పన్నుల పెంపుకు వ్యతిరేకంగా 15, 16 తేదీలలో అఖిలపక్ష పార్టీల పిలుపునిచ్చిన ఆందోళ‌న‌ల‌కు టీడీపీ సంఘీభావం  తెలుపుతున్న‌ట్లు చంద్ర‌బాబు వెల్ల‌డించారు.విశాఖలో ఆస్తుల తాకట్టు నుండి దృష్టి మరలించడానికి టీడీపీ నేతల ఆస్తులపై దాడులు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు.ఆనంద‌య్య మందు త‌య‌రీ చేయ‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌ని ఆరోపించారు.మద్యం, ఇసుక, సిలికా మాఫియాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల‌ని టీడీపీ డిమాండ్ చేసింది. మ‌రోవైపు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల‌ను కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెరో ప‌ది రూపాయ‌లు త‌గ్గించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: