2019 ఎన్నికలకు ముందు విపక్షాలు అన్నీ కూడా ఈవీఎం లతో ఎన్నికలు నిర్వహించడానికి ఏ మాత్రం అంగీకరించలేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ పిటీషన్ కొట్టేశారు. దీనిపై విపక్షాలు అన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు కూడా ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ తో ఎన్నికలకు వెళ్లడం సబబు కాదని దానిపై అనుమానాలు ఉన్నప్పుడు బ్యాలెట్ ఓటింగ్ కి వెళ్లడం చాలా మంచిది అని సూచనలు సలహాలు చేశారు.

అయినా సరే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ వల్ల ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఎన్నికల పారదర్శకంగా జరుగుతాయని వాటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని పదేపదే చెబుతూ వచ్చారు. బీజేపీ అగ్రనేతలు ఈ విషయంలో ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేశారు. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగడం అప్పట్లో ఓ సంచలనం అయింది. అయితే దేశం మొత్తం మోడీని బలమైన నాయకుడు అని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తూ ఉంటారు.

నిజంగా మోడీ అంత బలమైన నాయకుడు అయి ఉంటే రాహుల్ గాంధీ లాగా ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ తో ఎన్నికలు వద్దు అన్నప్పుడు ఎందుకు తిరస్కరించి ప్రధానిగా ఆమాట చెప్పలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా సరే ప్రతిపక్షాల మాటలు గౌరవించి ప్రతిపక్షాలు అన్నింటికీ 68 శాతం వరకు ఓట్లు వచ్చినప్పుడు ఆ పార్టీలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని దేశంలో 68 శాతం మంది మోడీని తిరస్కరిస్తూ ఉన్నప్పుడు అలా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని పలువురు నిలదీస్తున్నారు. జెమిని ఎన్నికల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆలోచన మారకపోతే అనవసరంగా ఇబ్బందులు ఉంటాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: