నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఇవాళ నిరుద్యోగ - నిరాహార దీక్ష  ను నిర్వహించారు  వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా మరోసారి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు పేల్చారు. కేటీఆర్ పుట్టిన రోజున నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసే బుద్ది ఇవ్వాలనే.. ఆయనకు ట్వీట్ చేశానని పేర్కొన్న వైయస్ షర్మిల... ఆ ట్వీట్  కేటీఆర్ కు, ఆయన టీమ్ కు నచ్చలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తన పై వ్యక్తిగత దాడికి దిగారని వైయస్ షర్మిల అన్నారు. పుట్టడం గొప్ప కాదు.. ప్రజలకు సేవ చేయడం గొప్ప అని... ప్రజల పక్షాన ప్రశ్నించడం తప్పా..? మీరు మరిచిపోయినందుకు గుర్తు చేస్తే తప్పా..? అని నిలదీశారు. 

దమ్ముంటే.. 54 లక్షల ఉద్యోగాల కల్పించాలని సవాల్ విసిరారు వైయస్ షర్మిల.  టిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తప్పితే.. రాష్ట్ర మంతా అప్పుల పాలు అయిందని నిప్పులు చెరిగారు వైయస్ షర్మిల. టిఆర్ఎస్ పాలనలో  4 లక్షల కోట్ల అప్పులు చేశారని...తెలంగాణలో 54 లక్షల మంది యువత నిరుద్యోగులు ఉన్నారని మండిపడ్డారు వైయస్ షర్మిల. ఏడేళ్లలో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగిందని.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజునే పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ తెచ్చుకొని ఏం సాదించామని... ఇంటికో ఉద్యోగం ఏమైంది.. నిరుద్యోగ భృతి ఏమైంది ? అని నిలదీశారు వైయస్ షర్మిల.  మనుషులనే అర్హత కోల్పోయిన పాలకులు ఉన్నారని మండిపడ్డారు.  వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని... ఉచిత విద్యుత్ కు ఆధ్యుడు వైఎస్ఆర్ అని తెలిపారు వైయస్ షర్మిల. వై.ఎస్. హయాంలో.. పేదవాడు ఫారిన్ చదువులు...15 నిమిషాల్లో కుయ్ కుయ్ అంటూ 108 అంబులెన్సులు... 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని కొనియాడారు. మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్, జంబో డిఎస్సీని వైఎస్  వేశారని గుర్తు చేశారు వైయస్ షర్మిల. అలాగే 11లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేశారని పేర్కొన్నారు వైయస్ షర్మిల.





మరింత సమాచారం తెలుసుకోండి: