నరేంద్ర మోడీ. ఈ రోజు దేశంలో అత్యంత బలమైన నాయకుడు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ ప్రధానిగానూ రెండు దఫాలుగా దేశాన్ని ఏలుతున్నారు. మోడీ మొత్తం రెండు దశాబ్దాల పాలనాపరమైన విధులలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు అన్నది విశేషంగా చెప్పుకోవాలి.

ఇక మోడీ మార్క్ పాలిటిక్స్ వేరు. ఆయన ట్రెడిషనల్ రూట్లను అసలు నమ్ముకోరు. ఆయన ప్రజలను మాత్రమే నమ్ముకుంటారు. మోడీ అందుకే ఎక్కువగా మౌనాన్నే ఆశ్రయిస్తారు. కీలకమైన అంశాలు ఎన్ని చర్చకు వచ్చినా కూడా మోడీ పార్లమెంట్ లో మాట్లాడింది చాలా తక్కువ. ఇపుడు ఫ్యోన్ టాపింగ్ మీద విపక్షాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. పార్లమెంట్ ని ప్రతీ రోజూ స్టాల్ చేస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం నుంచి సమాధానం ఇదీ అని మోడీ మాట్లాడడంలేదు.

మరో వైపు ఆయన సైలెన్స్ అంటున్నారు. మరి అదే ఆయన విధానమా, లేక వ్యూహమా అంటే మోడీ వ్యూహంగానే దీన్ని చూడాలి అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు మొదలై అపుడే  పది రోజులు గడచిపోయాయి. కానీ ఏ ఒక్క రోజూ సభ సవ్యంగా సాగడంలేదు. విపక్షాలు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ మోడీ మాత్రం అంతా చూస్తున్నారు.

గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు ఆయన మార్క్ పాలిటిక్స్ వేరుగా ఉండేవి. ఆయన కాలానికి చాలా సమస్యలను వదిలేసేవారు. మోడీ అలా కాదు, తన మౌనాన్నే ఆయుధంగా వాడుతూ విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చేస్తున్నారు. మోడీ నోటి వెంట ఏదో ఒక ప్రకటన వస్తే దాన్ని పట్టుకుని మరింతగా రచ్చ చేయాలని చూస్తున్న విపక్షాలకు ఆయన ఆ చాన్స్ అసలు ఇవ్వదలచుకోవడంలేదు. మొత్తానికి మోడీ స్ట్రాటజీకి ఇది మొదలు కాదు, చివరిది కూడా కాదు, గత  ఏడేళ్ళుగా ఆయన చాలా కీలకమైన సందర్భాలలో ఇలాగే వ్యూహాలను వాడుతున్నారు. విపక్షాలు మాత్రం గొడవనే నమ్ముకుంటున్నాయి. చూడాలి మరి ఈసారి అయినా మోడీ మౌనాన్ని విప్పేలా చేస్తాయేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: