పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను ద్విసభ్య కమిటీకి అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న బండారు శ్రావణి వర్గీయులు... నిన్న పార్టీకి రాజీనామా చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్న పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆమె కలిసిన తర్వాత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లే విబేధాలు ఉంటాయి అని అన్నారు ఆయన. విబేధాలు ఎంత ప్రమాదకరమైనవని ఆలోచించుకోవాలి అని సూచించారు. రెండు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉంటున్న...అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అన్నారు జేసి ప్రభాకర్ రెడ్డి.
నేను తెలుగుదేశం లోనే ఉన్నా అని అన్నారు. ఆయన ఆ మాటలు అనడం చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు. దురదృష్టం కాబట్టే 74 మున్సిపాలిటీ లో తెలుగుదేశం ఒక మున్సిపాలిటీ ఒకటి వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. అదృష్టం కాబట్టే అనంతపురం జిల్లాలో రెండు కౌన్సిలర్లు సీట్ కూడా రాలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పెద్ద మనిషి కి చెప్పండి ఏది అదృష్టమో ఏది దూరదృష్టమో అన్నారు జేసి. ఆయన ఏమి వ్యాఖ్యలు చేసాడో నాకు తెలియదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక జేసి వర్సెస్ అనంత టీడీపీ గా పరిస్థితి మారింది.