కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అంగీకరించే మాట. ఇదే తమ బలమని, బలహీనత కూడా అదేనని  ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇది ఆ పార్టీకి బలహీనత గా మారిన ఘటన లే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉంది. రాజకీయ పార్టీల నేతలు తమ అధినేతల మాటలకు కట్టుబడి ముందుకు వెళ్తారు. ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా తమ అధిష్టానాలు చెప్పినట్లు నడుచుకుంటారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుంటారు.

కానీ కాంగ్రెస్ పార్టీలో  అలాంటి పరిస్థితులు ఉండవు. నాయకులు బహిరంగంగానే చెప్తారు. అసలు సొంత పార్టీ నేతలే విమర్శలు చేసుకునే  పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పరిస్థితి ఇలా ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ బాగా జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో  బాగా నష్టపోయింది. ఈ క్రమంలోనే టిపిసిసి అధ్యక్షుడిగా వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్ ని ప్రత్యర్థులు కాదు, సొంత పార్టీ నేతలే కిందకి లాగుతున్నారు. ఇప్పటికే రేవంత్ కు పిసిసి ఇవ్వడంపై చాలామంది సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏదో మొహమాటం కొద్దీ రేవంత్ వెనుక పని చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు పార్టీకి డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. టిపిసిసి పదవి తనకే దక్కుతుందని మొదటి నుండి ఆశపడి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకునే సమస్యే లేదని వ్యవహరిస్తున్నారు. దీంతో వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేయడంతో పాటు,టిపిసిసి నిర్ణయాలను దిక్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చిన తొలినాళ్ళలో నే పదవిని కొనుక్కున్నారు అని కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులకు ఈ గొడవ సద్దుమణిగింది. మరోవైపు టీపీసీసీ చీఫ్ గా  రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తనకంటూ ఓ టీమ్ ను రెడీ చేసుకుని ప్రత్యర్థి  దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో సొంత పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి  ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇక విజయమ్మ మీటింగ్ విషయంలో కూడా కోమటిరెడ్డి వ్యవహారం రేవంత్ కి ఇబ్బందిగానే మారింది. తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రేవంత్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: