నియంత పాలన అనేదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది చైనా. ఇప్పటికే ప్రజాస్వామ్యం తో సంబంధం లేకుండా చైనాకు శాశ్వత అధ్యక్షునిగా అంటూ జిన్పింగ్ ప్రకటించుకున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండానే ఇక శాశ్వత అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అక్కడ ప్రజల హక్కులను కూడా కాలరాస్తూ ప్రభుత్వం ఎప్పుడు నియంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగాఎవరు మాట్లాడిన వారు ఎంతటి వారైనా సరే దారుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది చైనా.


 కానీ ప్రభుత్వానికి ఎదురు చెప్తే ఏమవుతుందో అనే భయంతో ఎవరూ కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం లాంటివి చేయడానికి అస్సలు ధైర్యం చేయరు.. ఒకవేళ కొంతమంది ధైర్యం చేసి నిరసన తెలిపిన ఆ తర్వాత వాళ్లు కనిపించకుండా పోవడం అందరిలో భయాన్ని నింపుతుంది అనే చెప్పాలి. అయితే ఇటీవల కాలం లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా కారణంగా ఎంతో మంది సెలబ్రెటీలు సాధారణ నెటిజన్లతో సైతం సరదాగా మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యం లో ఇటీవల చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ సెలబ్రిటీలు ఎవరు కూడా ఇకనుంచి సోషల్ మీడియా వేదికగా సాధారణ పౌరులతో మాట్లాడడానికి వీలు లేదు అంటూ ఒకసరి కొత్త చట్టాన్ని  తెరమీదికి తెచ్చింది చైనా ప్రభుత్వం. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా  మారి పోయింది. అయితే ప్రజల హక్కులను కాలరాసే విధం గానే ప్రస్తుతం చైనా తీసుకువచ్చిన నియంత్రణ చట్టం ఉండ బోతుంది అనేది ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ఇలా ఎవరు ఎన్ని చెప్పినా చైనా మాత్రం చేయాలనుకున్నది చేస్తూ ముందుకు సాగుతోంది అన్నది అందరికీ తెలిసిన నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: