ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉండగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు తెగించింది ఎందుకనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటింటికీ టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమైన సంగతి తెలిసిందే.  తమ పాలనపై ప్రజల్లో సానుకూల అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేయాలనే  మంచి ఉద్దేశంతో  ఏపీ సర్కార్  ఈ దిశగా  అడుగులు వేస్తోంది.  ఇంటి ముందు స్టిక్కర్లు వేయాలనే  ఆలోచనతో కూడా కూటమి సర్కార్ ఉంది.  అయితే  కొందరు నాయకుల నిర్లక్ష్యం  వెనుక అసలు కారణం  వేరే ఉందని సమాచారం ఉంది.

కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు  ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే శక్తి ఉంటె మాత్రమే  వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు దక్కుతాయని   కాన్ఫిడెన్స్ తో ఉన్నారని  సమాచారం అందుతోంది. అందుకే ఈ నేతలు  చంద్రబాబు మాటను సైతం లెక్క చేయడం లేదని  సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో అయినా ఈ నేతల తీరు మారుతుందేమో చూడాల్సి ఉంది.

అయితే టీడీపీ ఎమ్మెల్యేల నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అవినీతి, అక్రమాలు చేసిన   వైసీపీ ఎమ్మెల్యేలకు   ఎలాంటి పరిస్థితి ఎదురైందో  ఇప్పుడు ప్రత్యేకంగా   చెప్పాల్సిన అవసరం లేదు.  టీడీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రణాళికలు ఏ  విధంగా ఉండబోతున్నాయో   చూడాల్సి ఉంది.  తీరు మారకపోతే మాత్రం ఈ నేతలకు  భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: