
టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షణ విభాగం ఏర్పాటును సిఫారసు చేసింది. ప్రభుత్వ, పరిశ్రమల ప్రతినిధులతో కూడిన ఈ విభాగం అవసరమైన సంస్కరణలు చేపట్టి, అడ్డంకులను తొలగిస్తుందని తెలిపింది. చంద్రబాబు ప్రతిపాదించిన పీ4 విధానం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని, ఇలాంటి నమూనాలను అనుసరించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని నివేదిక సూచించింది. రుణాలు అభివృద్ధికి అడ్డంకిగా మారకుండా ద్రవ్యనియంత్రణ చట్ట నిబంధనలను అమలు చేయడానికి స్వతంత్ర సంస్థ ఏర్పాటు అవసరమని నొక్కిచెప్పింది.రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఏఎంటీజెడ్) కాన్సెప్ట్‌ను ప్రోత్సహించాలని, లైఫ్‌సైన్సెస్, సెమీకండక్టర్స్, ఎనర్జీ స్టోరేజ్, సోలార్ సెల్స్ వంటి హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ‘సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటు చేయాలని నివేదిక సిఫారసు చేసింది.
ఈ కేంద్రాలు ప్రపంచ స్థాయి సాంకేతిక ఆవిష్కరణలకు ఊతమిస్తాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి హబ్‌గా మారుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. నీతి ఆయోగ్‌తో కలిసి స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సిట్) స్థాపన రాష్ట్ర విధానాలను మరింత బలోపేతం చేస్తుందని నివేదిక తెలిపింది.ఈ నివేదిక రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెవెన్యూ వ్యయాలకు రెవెన్యూ రాబడిని, మూలధన వ్యయాలకు రుణాలను వినియోగించడం ద్వారా ఆర్థిక సమతుల్యత సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ సిఫారసులు ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు