తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబో ఎట్టకేలకు సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, ఇప్పుడు మరో పాన్ ఇండియా విజువల్ బ్లాక్‌బస్టర్‌గా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ అనే ఫన్ & హారర్ ఎలిమెంట్స్ కలిగిన సినిమాను డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పూర్తి చేసే దశలో ఉన్నారు. అలాగే ఫౌజీ అనే మిలిటరీ నేపథ్య మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. కానీ అన్నీ సినిమాలకూ మించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ‘స్పిరిట్’.


సందీప్ రెడ్డి వంగా – ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘య‌నిమల్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు డార్లింగ్‌తో కలిసి వస్తున్నాడు అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో విజయ్ దేవరకొండతో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. "స్పిరిట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది" అని తెలిపారు. ఇప్పుడు మేకర్స్ అధికారికంగా వెల్లడించిన ప్రకారం, ఈ సినిమా సెప్టెంబరు 2025లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనుండగా, దేశవ్యాప్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారనే విషయం ఇప్పటికే వైరల్ అయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన క్యారెక్టర్స్‌లో ఇది పూర్తిగా విభిన్నంగా ఉండనుందని ఫిలింనగర్ టాక్.



ఇక ప్రభాస్ విషయానికొస్తే.. షూటింగ్‌లకు విరామం లేకుండా పనిచేస్తూ, ఎప్పుడూ స్క్రిప్ట్‌లు, సెట్స్‌లో ఉండే వారిలో డార్లింగ్ టాప్‌లో ఉంటారు. తినే టైమ్‌లో మాత్రమే రిలాక్స్ చేస్తారంతే కానీ.. వెకేషన్, లాంగ్ ట్రిప్స్ అనేవి ప్రభాస్ డిక్షనరీలో ఉండవు. అందుకే ఒక్కోసారి ప్రభాస్ హెల్త్ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఉంటారు. మొత్తానికి.. సెప్టెంబర్ నుంచి ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం అవుతుందన్న వార్తతో డార్లింగ్ అభిమానుల్లో జోష్ నెలకొంది. పోలీస్ అవతారంలో ప్రభాస్ ఎలా కనిపిస్తారో? సందీప్ వంగా స్టైల్ మ్యాసివ్ మేకింగ్ ఎలా ఉంటుందో? అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: