- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా, నాయకులు అరెస్ట్ అయ్యి జైలులో ఉంటే రాజకీయంగా తీవ్ర ప్రభావాలు చూపే ప్రమాదం ఉంటుంది. వారి పై కేడ‌ర్‌కు ఉన్న నమ్మకం స‌న్న‌గిల్లుతూ ఉంటుంది. మిథున్ రెడ్డి మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనపై నమోదైన కేసుపై పెద్దగా స్పందించకపోవడం, లైట్ తీసుకున్నట్లు కనిపించడం, రాజకీయంగా వ‌ర్గాల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది. ఇటీవల మిథున్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన దాని ప్ర‌కారం చూస్తే మిథున్ రెడ్డి జైల్లో ఎంతో హ్యాపీగా ఉన్నారని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చూస్తే, మిథున్ రెడ్డి మద్యం కేసును పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతుంది. మరి దీనికి కారణం ఏమిటన్నదానిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.


తనకు ఈ కేసులో ఏమీ జరగదన్న ధీమా:
మద్యం కుంభకోణం వ్యవహారంలో పేరు బయటకు వ‌చ్చినా అది పూర్తిగా మిథున్ రెడ్డిపైనే ఆధారపడద‌ని ఆయన నమ్మకం. ఈ స్కాంలో నకిలీ లైసెన్స్‌లు, అక్రమ అనుమతులు, అధికారులు, ఇతర రాజకీయ నాయకుల పాత్రలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తే, ఆయన తప్పులేమీ లేవని సాక్ష్యాధారాలు ఉంటాయ‌న్న‌ విశ్వాసం ఆయనలో కనిపిస్తోంది.


2. అన్యాయంగా అరెస్ట్ చేశారన్న భావన:
జైలులోకి వెళ్లిన నాయకుల్లో ఎక్కువమందిలో కలిగే భావన ఇదే. "తమను ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారు" అనే భావన మిథున్ రెడ్డిలోనూ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన, తన అరెస్ట్ వెనుక పోలిటికల్ టార్గెట్ ఉంద‌న్న అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. పైగా, ఈ అరెస్ట్‌ను భవిష్యత్తులో ఓ సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోవాల‌ని మిథున్ రెడ్డి ప్లాన్‌తో ఉన్నార‌ట‌.
3. ఎంపీగా ఉన్న ధైర్యం:
మిథున్ రెడ్డి ప్రస్తుత ధైర్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి, ఆయన ఇప్పటికీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అధికారిక పదవి వల్ల వచ్చే ఓ హౌస్ ఆఫ్ ప్రొటెక్షన్, ప్రజల్లో ఉన్న ప్రభావం – ఇవన్నీ కలిసి ఆయనలో ఓ కాన్ఫిడెన్స్ ని ఇస్తున్నాయి. కానీ, అది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: