2009లో "జోష్" సినిమాతో తెలుగు చిత్రసీమలోకి నాగచైతన్య ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. "100% లవ్", "మనం", "ప్రేమమ్", "రారండోయ్ వేడుక చూద్దాం", "మజిలీ", "లవ్ స్టోరీ" సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న నాగచైతన్య ఈ ఏడాది "తండేల్" సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్య నటిస్తున్నారు.

 బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు నాగచైతన్య సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ2 మూవీ విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన 2024  సంవత్సరం డిసెంబర్ 4న శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి రెండో పెళ్లి అనే సంగతి తెలిసిందే.

పిల్లల గురించి గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చైతన్య తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనకు  ఒకరు లేదా ఇద్దరు పిల్లలు కావాలని, తన చిన్నతనంలో తాను గడిపిన క్షణాలను వారితో తిరిగి పొందాలని ఆశిస్తున్నానని తెలిపారు. తాజాగా మరోసారి పిల్లల గురించి చైతన్య మాట్లాడుతూ 50 ఏళ్ళు వచ్చేసరికి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలని ఉందని అన్నారు. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తానని కూతురు పుడితే ఇష్టాలను ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చారు.

నేను ఎంజాయ్ చేసిన విధంగా పిల్లలతో ఎంజాయ్ చేస్తే ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు. శోభిత గర్భవతి అనే పుకార్లు ఇటీవల వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టత వచ్చింది.  నాగచైతన్య పారితోషికం 15 కోట్ల రూపాయలకు అటుఇటుగా ఉండగా ఈహీరో ఖాతాలో భారీ హిట్లు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శోభితను ప్రేమగా తాను  బుజ్జితల్లి అని పిలుస్తానని నాగచైతన్య కామెంట్లు చేశారు. తర్వాత సినిమాలతో నాగచైతన్య మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: