జగన్ని అంతా డేరింగ్ అండ్ డ్యాషింగ్ లీడర్ అంటారు. మాట ఇస్తే మడమ తిప్పరు అని కూడా ప్రచారంలో ఉంది. దాన్ని తన నేత గొప్పతనంగా కూడా చెప్పుకుంటారు. జగన్ పట్టుదల పడితే వెనక్కు తగ్గరని కూడా అంటారు. ఆయన బాట రాచబాట అని కూడా చెబుతారు. అటువంటి జగన్ కి ధైర్యం ఉందా అంటే ఆ పార్టీ నాయకులకు  ఎలా ఉంటుంది. అందులో ఆయన రాయలసీమ బిడ్డ. వైఎస్ కుటుంబవారసుడు. ఢిల్లీ కోటల కుట్రలను చేదించి మరీ ఏపీలో అధికారం సంపాధించిన వాడు. బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రి సీటుపై హాయిగా కూర్చున్న చరిష్మాటిక్ లీడర్.


అమరావతిలో రాజధాని, ఇది రాయలసీమ వాసులకు మింగుడుపడని వ్యవహారమే అంటున్నారు. విభజన తరువాత  కేవలం నాలుగే జిల్లాలు ఉన్నాయని చెప్పి తొమ్మిది జిల్లా కోస్తా వాసులు తమను మోసం చేశారని సీమజనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీభాగ్ ఒప్పందాన్ని సైతం ధిక్కరించి సీమకు దక్కాల్సిన రాజధానిని అమరావతిలో పెట్టారని ఇప్పటికీ సీమవాసులు బాధపడుతున్నారు.


అదే సమయంలో కనీసం సీమలో  హైకోర్టునైనా పెట్టమన్నా కూడా ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేశారని మరింత వేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో సీమవాసుల్లో కొత్త ఆశలు వచ్చాయి.హైకోర్టునైనా జగన్ సీమకు వరప్రసాదంగా ఇస్తారని ఇన్నాళ్ళు సీమ ప్రజలు అనుకుంటూ వచ్చారు. అయితే రాజధాని మార్పు అన్న వార్తలు వైసీపీ సర్కార్ నుంచి వినిపించడంతో మళ్ళీ రాజధాని మీదనే పట్టుపట్టాలనుకుంటున్నారుట.


దీని మీద సీమజనం అభిప్రాయం ఎలా ఉందంటే రాజధాని కచ్చితంగా తమకే ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ విధంగా చేసి శ్రీభాగ్ ఒప్పందాన్ని జగన్ అయినా గౌరవించాలని కూడా వారు కోరుతున్నారు. అయితే సీమ ఉద్యమనేతలు మాత్రం జగన్ విషయంలో వేరే విధంగా స్పందిస్తున్నారు. జగన్ కి అంత ధైర్యం ఉందా అని వారు అంటున్నారు. రాజధాని తరలింపు అసలు  పెద్ద సమస్య కానే కాదని కూడా వారు అంటున్నారు.


 ప్రభుత్వం తలచుకుంటే  సులువుగా అయ్యే పనేనని కూడా అంటున్నారు.  అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఇవ్వలేని జగన్ రాయలసీమకు రాజధాని తీసుకువస్తారా అని కూడా సెటైర్లు వేస్తున్నారట. మరి జగన్ సీమ ఉద్యమకారుల మనసు ఎలా గెలుచుకుంటారో చూడాలి. అలాగే తాను పుట్టిన సీమకు  న్యాయం ఎలా చేస్తారో కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: