భారత మాజీ ఆటగాడు , ప్రస్తుత టీవీ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ టీం ఇండియా స్పిన్ బౌలర్ ,ఢిల్లీ కాపిటల్ కీలక బౌలర్ రవీంద్రన్ అశ్విన్ పై ఘోరాతిఘోరమైన కామెంట్స్ చేశాడు. అతడు t20 ఫార్మేట్ కి పనికిరాదని తేల్చేశాడు. ఈ పొట్టి ఫార్మేట్ లో వికెట్స్ తీయలేడని చెప్పాడు. నాకంటూ ఒక జట్టు ఉంటే కచ్చితంగా అతడిని తీసుకోనని కుండలు బద్దలు కొట్టాడు. గత ఐదేళ్లు గా అతడు ప్రథినిధ్యం వహించిన జట్టు గెలిచిన దాఖలాలు లేవని చెప్పాడు.


అయన మాట్లాడుతూ " ఇప్పటికే అతగాడి గురించి మాట్లాడి టైం వృధా చేశాం. t20 ల్లో ఏ జట్టుకి అతడు కీలకం కాదు. మీరు అది మారాలని కోరుకున్నా జరుగుతుందని నేననుకోనూ , గత ఐదేళ్లుగా అతడు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు అతడు భారం గానే కనిపిస్తున్నాడు . నేనైతే నా జట్టులోకి అతడిని ఏమాత్రం తీసుకోను , టెస్టుల్లో అతడు గొప్ప బౌలర్ అయినప్పటికీ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతడు ఒక్క మ్యాచ్ ఆడకపోవడం చాల విడ్డురం " అంటూ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడారు . ఐపీల్ 14 లో భాగంగా బుధవారం రోజున ఢిల్లీ కాపిటల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య క్వాలిఫైయర్ 2 జరిగింది. చివరి ఓవర్ లో కోల్‌కతా కోసం తొమ్మిది పరుగులు అవసరం కాగా అశ్విన్ బౌలింగ్ వేసాడు . మొదటి  రెండు బంతుల్లో  కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడం జరిగింది .  ఫస్ట్ రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మూడవ బంతికి షకీబ్ అవుట్ అయ్యాడు. నాల్గవ బంతికి నరైన్ భారీ షాట్ కి పోయి లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ చేతుల్లో కి వచ్చింది అనుకుంటున్న తరుణం లో అశ్విన్ వేసిన ఐదవ బంతికి త్రిపాఠి సిక్స్ కొట్టడం తో మ్యాచ్ ను కేకేఆర్ సునాయాసంగా గెలిచి ఫైనల్స్ కి దూసుకెళ్లింది.



మరి సంజయ్ చేసిన ఈ కామెంట్ కి రవీంద్రన్ అశ్విన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి. మరో పక్క t20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుండి మొదలు కాబోతుంది. t20 ప్రపంచ కప్ లో ఇప్పటికే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు రవీంద్ర అశ్విన్. మరి ఈ కామెట్స్ తో తన సత్తా చాటుతాడో లేక చతికిల పడి వ్యాఖ్యాత మాటలను నిజం చేస్తాడో వేచి చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: