టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. ఒకప్పుడు రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దొరకడం మే గొప్ప అన్న విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రవీంద్ర జడేజా లేనిదే ఇండియా జట్టు లేదు అన్న విధంగా మారిపోయింది. దీనికి కారణంగత కొన్ని రోజుల నుంచి రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉండడమే. కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు బ్యాటింగ్లో ఫీల్డింగ్  లో కూడా అదరగొడుతున్నాడు. కీలక సమయంలో తన స్పిన్ బౌలింగ్ తో వికెట్లు పడగొట్టే రవీంద్ర జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్కు దిగి భారీగా పరుగులు చేస్తూ ఉంటాడు.


 ఇక మైదానంలో పాదరసంలా కదులుతూ రవీంద్ర జడేజా చేసేమెరుపు ఫీల్డింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా లోని అన్ని ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా మారిపోయాడు రవీంద్ర జడేజా. ఇక భారత్ ఎక్కడికి పర్యటనకు వెళ్లినా కూడా అందులో సెలెక్ట్ అవుతూ వస్తున్నాడు. అయితే ఇటీవలే రవీంద్ర జడేజా సౌత్ఆఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ కారణంగా రవీంద్ర జడేజా గాయం బారిన పడ్డాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.


 ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు రవీంద్ర జడేజా. అయితే తన కెరీర్ ను కాపాడుకోవడానికి రానున్న రోజుల్లో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు అన్నది అర్ధమవుతుంది. వన్డే టి20 ఫార్మాట్ క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగేందుకు జడేజా ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడట. అయితే ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో అయినా గాయం మానడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో కోలుకున్న తర్వాత టెస్ట్ ఫార్మాట్ కి రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: