
వీరిలో ప్రతి ఫ్రాంచైజీలో ఎవరో ఒకరు ఉన్నారు. ఆ రకంగా చూస్తే మొదటగా డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లో యంగ్ బౌలర్ తుషార్ దేశ్ పాండే. ఇతనికి చెన్నై మంచి ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఎందుకో తనను తాను నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. వికెట్లు తీయకపోగా పరుగులను కూడా ఆపలేకపోవడంతో ఇతనిపై వేటు పడింది. ఆ తర్వాత జట్టులోకి వచ్చిన ముఖేష్ చౌదరి అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ఇక కోల్కతా విషయానికి వస్తే గత ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్శించిన వెంకటేష్ అయ్యర్ ఈ సారి మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. దీనితో మ్యాచ్ లో సైతం చోటు కోల్పోయాడు. ఇక ఇదే ఫ్రాంచైజీలో కీపర్ గా జట్టులోకి వచ్చిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ కూడా తనకు దక్కిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యాడు. ఇక ఇదే బాటలో వరుణ్ చక్రవర్తి మరియు శివమ్ మావి ఉన్నాడు. వికెట్లు తీయకపోగా పరుగులను సైతం కట్టడి చేయలేకపోతున్నారు.
ఇక ఢిల్లీ లో చెప్పుకుంటే ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు... మన్దీప్ సింగ్, లలిత్ యాదవ్ మరియు సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశాలు వచ్చినా చేజేతులా పోగొట్టుకుంటున్నారు. ఇక ముంబై నుండి ప్రధానంగా ఇషాన్ కిషన్ దారుణంగా ఫెయిల్ అవుతుండగా, మురుగన్ అశ్విన్ మాత్రం మొదటి మ్యాచ్ మినహా తేలిపోయాడు. పంజాబ్ జట్టుకు ఎంతో ప్రదానం అని భావించిన చెన్నై ఆటగాడు షారుఖ్ ఖాన్ ఈ సీజన్ లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీనితో గత రెండు మ్యాచ్ ల నుండి తుది జట్టులో చోటు కోల్పోయాడు. గుజరాత్ నుండి విజయ్ శంకర్ మరియు అభినవ్ మనోహర్ లు వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఇక విజయ శంకర్ కెరీర్ పోయినట్టే. కొత్త ఐపీఎల్ జట్టు లక్నో నుండి మనీష్ పాండే వరుసగా దక్కిన అవకాశాలను వాడుకోలేక విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు తుది జట్టులోనూ ఛాన్స్ లేకుండా పోయింది. హైదరాబాద్ రిటైన్ చేసుకున్న వారిలో అబ్దుల్ సమద్ ఒకరు. ఇతనికి దక్కిన అవకాశాలు మరెవరికీ దక్కలేదు అని చెప్పాలి. అయినా ఎందుకో వరుసగా విఫలం అయ్యి తుది జట్టులో చోటు కోల్పోయాడు. రాజస్థాన్ నుండి కరుణ్ నాయర్ మరియు యశస్వి జైస్వాల్ లు విఫలం అయ్యారు.
ఇలా పలువురు ఆటగాళ్లు సరైన ప్రదర్శన కనబరచలేక జట్టుకు భారంగా మారుతున్నారు.