ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గతంలో కరోనా వైరస్ కారణంగా వాయిదా పడి రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది టీమ్ ఇండియా. టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత వన్డే టి20 మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. అయితే జూలై 1వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది టీమిండియా. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇక టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండకపోవచ్చు అనే అనుమానాలు వచ్చినప్పటికీ ప్రస్తుతం రోహిత్ వేగంగా కోలుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ఇప్పటికే టెస్టు సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. ఇక చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచిన లేదా మ్యాచ్ డ్రాగా ముగిసిన కూడా సిరీస్ టీమ్ ఇండియా వశం అవుతుంది అని చెప్పాలి. కాగా జులై 1వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా అంతకు ముందే ఇటీవలి లీస్టర్ షైర్ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడింది. ఇక ఈ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ డ్రా అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ పై ఇటీవలే కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 జూలై 1వ తేదీ నుంచి  ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కి టీమిండియా అన్ని విధాలుగా సన్నద్ధమైంది అంటూ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. ఈ టెస్టుకు ముందు లిస్టర్ షైర్ తో ఆడిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా అయినప్పటికీ.. వార్మప్ మ్యాచ్లో భారత జట్టు తమ లోపాలను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లో భారత ప్రదర్శనతో ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. ఇకపోతే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ వరకు రోహిత్ శర్మ కోలుకో కపోతే  బుమ్రా కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది అంటూ వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: