మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ జట్టుకు ఇక ఇప్పుడు వరుస పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా అక్కడ ఇండియా పై టెస్టు మ్యాచ్ గెలిచి సత్తా చాటింది ఇంగ్లాండ్ జట్టు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం చేదు అనుభవమె ఎదురైంది. టీ20 వన్డే సిరీస్ టీమ్ ఇండియా వశం కావడంతో ఇక సొంతగడ్డపైనే షాక్ తగిలింది అని చెప్పాలి. మొన్నటి వరకూ పరిమిత ఓవర్ల ఫార్మాట్ జట్టుకి కెప్టెన్ గా ఉన్నాడు ఇయాన్ మోర్గాన్. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక ఇయాన్ మోర్గాన్ తర్వాత జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్నా జాస్ బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడ వరకు అంతా బాగానే జోస్ బట్లర్ ఏ ముహూర్తాన కెప్టెన్సీ చేపట్టాడో కానీ ఇప్పుడు వరకు అతని కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు సరైన విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ఇప్పటికే సొంత గడ్డపై టీమిండియా చేతిలో టి20, వన్డే సిరీస్ ఓడిపోయి నిరాశలో ఉన్న ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికా గడ్డపై కూడా శుభారంభం అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఇటీవల సౌత్ ఆఫ్రికా లో జరిగిన మ్యాచ్లో ఏకంగా 62 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది ఇంగ్లాండ్ జట్టు.



 ఇక భారత్తో జరిగిన మ్యాచ్ లోనే కెప్టెన్గా తొలి ఓటమి అందుకుని జోస్ బట్లర్.. రెండో మ్యాచ్లో గెలిచినా కూడా సిరీస్ మాత్రం కాపాడుకోలేక పోయాడు. అదే సమయంలో ఇక తీరికలేని షెడ్యూల్ కారణంగా అలసిపోయి చిరాకుతో చివరికి వన్డే ఫార్మాట్ క్రికెట్కు బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడం కూడా అటు ఇంగ్లాండ్ జట్టును మరింత దెబ్బతీసే అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మెల్లిమెల్లిగా అటు జోస్ బట్లర్ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్న వారు కూడా పెరిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో అయినా జోస్ బట్లర్ తన కెప్టెన్సీ తో ఆకట్టుకుంటాడో లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: