గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ ఎంత పేలవమైన ఫాంలో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిసిసీఐ అతనికి వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికీ ఎక్కడ అతను మాత్రం ఫామ్ అందుకోలేక పోతున్నాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం ఎందుకొ వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. దీంతో కోహ్లీ పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.


 అదే సమయంలో ఇక విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే కోహ్లీ వైఫల్యంపై టీం ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనికి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అంటూ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. కోహ్లీ బాగా ఆడుతున్న రోజుల్లో ఎలా ఆడాలి అనే విషయంపై ఒక్కరు కూడా నోరు మెదపలేదు  అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఇక కోహ్లీ పై విమర్శలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్లో మంచి ప్రదర్శన చేయకపోవడంతో వెస్టిండీస్ టూర్లో అతనికి విశ్రాంతి ఇచ్చారు.


 ఈ క్రమంలోనే అతని జట్టు నుంచి తప్పించారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్  కార్యక్రమంలో మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. శతకాల మీద శతకాలు సాధించినా రోజుల్లో ఇలా ఆడాలి ఆడాలి ఆడాలి అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు కూడా బాగా ఆడాలని చెప్పే అర్హత ఎవరికీ లేదు.   కోహ్లీకి మరో 30 నుంచి 35 సెంచరీలు సాధించే సత్తా కూడా అతనిలో ఉంది. అతన్ని కొన్ని రోజుల పాటు వదిలేయాలి. మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావాలంటే పరుగులు చేయాలంటే ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలా లేకపోతే నచ్చినట్టు క్రికెట్ ఆడాలా అన్న విషయం కూడా అతనికి వదిలేయాలి అంటూ రాబిన్ ఉతప్ప  చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నిరూపించుకోవాల్సినంత నిరూపించుకున్నాడని..అతను ఎప్పటికీ మ్యాచ్ విన్నర్ అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: