సాధారణంగా వరల్డ్ కప్ లో భాగంగా ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఎన్నో పాత సెంటిమెంట్లను తెరమీదకి తీసుకువచ్చి ఇక మాజీ ఆటగాళ్లు ప్రేక్షకులు కూడా తమ రివ్యూలను ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి రివ్యూలను ఇచ్చారు.కామెంటేటర్లు సైతం ఇక ఈ రివ్యూలు నిజమే అని నమ్మేశారు. ఇంతకీ టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో వచ్చిన రివ్యూ ఏంటంటే.. ఆడి లైట్లు వరల్డ్ కప్ లో భాగంగా టాస్ ఓడిపోయిన జట్టే ఇప్పుడు వరకు  గెలుస్తూ వచ్చింది.


 గత 11 మ్యాచ్లలో చూసుకుంటే ఇలాగే జరిగింది. ఇక ఏ రెండు జట్ల మధ్య పోటీ జరిగిన కూడా టాస్ ఓడిపోయిన జట్టు చివరికి పై చేయి సాధించి విజయ డంకా మోగించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇక ఇంగ్లాండ్ టీమిండియా మధ్య ఆడిలైట్ వేదికగా మ్యాచ్ జరిగిన నేపథ్యంలో రోహిత్ సేన టాస్ ఓడిపోవాలని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కోరుకున్నారు. ఇక సెంటిమెంట్ కలిసొచ్చి టీమిండియా విజయం సాధిస్తుందని భావించారు. అయితే అందరూ కోరుకున్నట్లుగానే టీమిండియా టాస్ ఓడిపోయింది. అదే సమయంలో మ్యాచ్ కూడా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా ఆడిలైట్ లోని ఓవల్ స్టేడియంలో టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా గెలుస్తుంది అనుకుంటే మాత్రం చివరికి ఇంగ్లాండ్ కు కనీస పోటీ ఇవ్వలేక పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆడిలైట్లో ఉన్న ఓవల్ స్టేడియంలో టాస్ ఓడిన జట్టు కాకుండా టాస్ గెలిచిన జట్టు విజయం సాధించడం మాత్రం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఆడిలైట్ లో టాస్ ఓడిపోయిన జట్టు ఇక తర్వాత మ్యాచ్లో కూడాఓడిపోవడం కేవలం టీమ్ ఇండియా విషయంలోనే జరిగింది. దీంతో టీమిండియా ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: