గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక  సిరీస్లలో అదరగొడుతున్న టీమ్ ఇండియా జట్టు ఇక భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుతో సిరీస్ లలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. టి20 సిరీస్ విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టు అటు వన్ డే సిరీస్ లో కూడా అదే జోరును కొనసాగించింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఇక సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇక నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్లు శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సెంచరీ తో చెలరేగిపోవడం గమనార్హం.


 ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే అటు శ్రీలంక బౌలర్ల పై వీర విహారం చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సెంచరీ చేసేంతవరకు కూడా కాస్త ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత మాత్రం బ్యాటింగ్ విధ్వంసాన్ని  కొనసాగించాడు. ఏకంగా 110 బంతుల్లోనే 166 పరుగులు చేశాడు. కాగా ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ సెంచరీ గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. కాగా ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు ఎనిమిది సిక్సర్లు  ఉన్నాయి అని చెప్పాలి. తద్వారా కెరియర్ లో 74 వ సెంచరీ నమోదు చేశాడు.



 ఇకపోతే విరాట్ కోహ్లీ మెరుపు బ్యాటింగ్ లో కొట్టిన ఒక షాట్ మాత్రం ఇక అభిమానులందరికీ కూడా విరాట్ కోహ్లీకి ఎంతో సన్నిహితుడైన మహేంద్రసింగ్ ధోని గుర్తు చేసింది అని చెప్పాలి. ఇన్నింగ్స్ 44 ఓవర్ నాలుగో బంతికి లాంగ్ ఆన్ మీదుగా అద్భుతమైన సిక్సర్  కొట్టాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ షాట్ ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులకు మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేస్తుంది.  రజిత వేసిన బంతిని ధోని స్టైల్ లో హెలికాప్టర్ షాట్ ఆడాడు విరాట్ కోహ్లీ. దీంతో బంతి నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లి పడింది. ఏకంగా ఇది 97 మీటర్ల సిక్స్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో ట్విటర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: